Tummala Nageswar Rao : హస్తం గూటికి తుమ్మల..?
నాగేశ్వర్ రావును కలిసిన రేవంత్ రెడ్డి
Tummala Nageswar Rao : తెలంగాణలో అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి పార్టీకి కోలుకోలేని షాక్ తగలనుందా. మాజీ మంత్రి , సీనియర్ నాయకుడు, ఖమ్మం జిల్లాకు చెందిన తుమ్మల నాగేశ్వర్ రావు పార్టీకి గుడ్ బై చెప్పనున్నారా. అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి.
Tummala Nageswar Rao may be Joined in Congress?
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి, సీనియర్ నాయకుడు మల్లు రవి తుమ్మల నాగేశ్వర్ రావు నివాసానికి వెళ్లారు. ఈ సందర్బంగా సాదర స్వాగతం పలికారు తుమ్మల. శాలువాలు కప్పి సన్మానించారు. రేవంత్ రెడ్డిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు.
ఇదిలా ఉండగా తుమ్మల నాగేశ్వర్ రావును(Tummala Nageswar Rao) కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు రేవంత్ రెడ్డి. సానుకూలంగా స్పందించారు మాజీ మంత్రి. తుమ్మల నాగేశ్వర్ రావుకు బలమైన క్యాడర్ ఉంది. ఆయన గతంలో తెలుగుదేశం పార్టీలో కీలకమైన నేతగా ఉన్నారు. మంత్రిగా పని చేశారు.
అనంతరం రాజకీయ సమీకరణలు మారడంతో తుమ్మల నాగేశ్వర్ రావు కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. కొంత సైలెంట్ అయ్యారు. ఇప్పటికే బీఆర్ఎస్ లో ఉన్న కీలకమైన నాయకుడు , మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఒకవేళ తుమ్మల గనుక వేస్తే కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూరనుందనేది వాస్తవం.
Also Read : PM Modi Congrats : యువతకు నిత్య స్పూర్తి ప్రజ్ఞానంద