Tushar Gandhi : రాహుల్ కామెంట్స్ తుషార్ గాంధీ స‌పోర్ట్

వాట్సాప్ యూనివ‌ర్శిటీ మంచిది కాదు

Tushar Gandhi : మ‌హారాష్ట్ర‌లో కొన‌సాగుతున్న రాహుల్ గాంధీ జోడో పాద‌యాత్ర‌లో అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. జాతిపిత మ‌హాత్మా గాంధీ మ‌నుమ‌డు తుషార్ గాంధీ శుక్ర‌వారం రాహుల్ తో పాటు పాల్గొన్నారు. ఆయ‌న‌కు సంఘీభావం ప్ర‌క‌టించారు.

ఈ సంద‌ర్భంగా రాహుల్ గాంధీ ఆర్ఎస్ఎస్ సిద్దాంత‌క‌ర్త వీర సావ‌ర్క‌ర్ పై చేసిన సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఈ త‌రుణంలో రాహుల్ గాంధీకి పూర్తిగా మ‌ద్ద‌తుగా నిలిచారు తుషార్ గాంధీ(Tushar Gandhi) . భార‌తీయ జ‌న‌తా పార్టీ చేస్తున్న ప్ర‌చారం పూర్తిగా అబ‌ద్ద‌మ‌న్నారు.

ఇదే స‌మ‌యంలో వాట్సాప్ యూనివ‌ర్శిటీ మంచిది కాద‌ని స్ప‌ష్టం చేశారు. ప్రాంతం, కులం, మ‌తం పేరుతో విద్వేషాల‌ను రెచ్చ‌గొడుతూ దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ప్ర‌యత్నం చేస్తున్నా క‌మ‌లనాథులు, కాషాయ సంస్థ‌లకు రాబోయే రోజుల్లో ప్ర‌జ‌లు త‌గిన రీతిలో బుద్ది చెప్పాల‌ని పిలుపునిచ్చారు.

ఈ దేశానికి కావాల్సింది మతం కాదు మాన‌వ‌త్వం అవ‌స‌ర‌మ‌న్నారు తుషార్ గాంధీ. దేశానికి ద్వేషం కాదు ప్రేమ కావాల‌న్న రాహుల్ గాంధీని ప్ర‌తి ఒక్క‌రు స‌మ‌ర్థించాల‌ని కోరారు. ఇదిలా ఉండ‌గా వీర సావ‌ర్క‌ర్ పై చేసిన కీల‌క వ్యాఖ్య‌లు చేసిన రాహుల్ గాంధీపై పోలీస్ కేసు న‌మోదైంది.

ఇదే స‌మ‌యంలో తాను ఇప్ప‌టికీ చేసిన కామెంట్స్ కు క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని ప్ర‌క‌టించారు రాహుల్ గాంధీ. అదే స‌మ‌యంలో మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వానికి స‌వాల్ కూడా విసిరారు.

ద‌మ్ముంటే తాను చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర‌ను ఆపాల‌ని, అవ‌స‌ర‌మైతే న‌న్ను అరెస్ట్ చేయాల‌ని ఛాలెంజ్ చేశారు. దీంతో మ‌హారాష్ట్రలో రాజ‌కీయం మ‌రింత వేడెక్కింది.

Also Read : ద‌మ్ముంటే నా యాత్ర‌ను ఆపండి – రాహుల్

Leave A Reply

Your Email Id will not be published!