Twitter Brussels Office Close : ట్విట్టర్ బ్రస్సెల్స్ ఆఫీస్ క్లోజ్
ఉద్యోగుల రాజీనామాతో నిర్ణయం
Twitter Brussels Office Close : టెస్లా చైర్మన్ ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను టేకోవర్ చేసుకున్నాక కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే వస్తూనే టాప్ లెవల్లో ఉన్న వారిని తొలగించాడు. ఆ తర్వాత ఎంప్లాయిస్ కు కోలుకోలేని షాక్ ఇచ్చాడు. 5,900 మందికి పైగా పర్మినెంట్ స్టాఫ్ ను సాగనంపాడు.
ఆపై కాంట్రాక్టు కింద పని చేస్తున్న 5 వేల మందిని తొలగించాడు ఎలాన్ మస్క్(Elon Musk). ఇదే సమయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ బెంబేలెత్తిస్తున్నాడు. అంతే కాదు ఎవరైనా సరే ఆఫీసులకు రావాల్సిందేనని హుకూం జారీ చేశాడు. మరో వైపు మస్క్ టార్చర్ తట్టుకోలేక చాలా మంది ఉద్యోగులు ఎగనామం పెట్టారు.
ఆపై ఇక తాము రాలేమంటూ రాజీనామా చేశారు. అలాంటి వారిలో 1200 మంది ఉన్నారు. అంతే కాదు కోపంతో ఉద్యోగులు ట్విట్టర్ కు సమాధి కూడా కట్టేశారు. దీనిని కూడా ఎలాన్ మస్క్ టేకిట్ ఈజీగా తీసుకున్నారు. ఇదే సమయంలో ఫ్రాన్స్ లో పని చేస్తున్న చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ విల్ గుడ్ బై చెప్పాడు.
ఇప్పటికే ట్విట్టర్ లో టాప్ పొజిషన్ లో ఉన్న వారంతా వైదొలిగారు. కాస్ట్ కటింగ్ లో భాగంగా ఎవరికీ ఉచిత సౌకర్యాలు అంటూ ఉండవని స్పష్టం చేశాడు. ఇదే సమయంలో ఎవరైనా సరే ఏ స్థాయిలో ఉన్న వారైనా సరే ఆఫీసులకు రావాలని ఇంటి వద్ద నుండి పని చేస్తామంటే కుదరదన్నాడు.
ఈ క్రమంలో తాజాగా మస్క్ కు షాక్ తగిలింది. బ్రస్పెల్స్ లో ఉన్న ట్విట్టర్ ఆఫీసును(Twitter Brussels Office Close) శుక్రవారం మూసి వేశారు. ఉన్న ఇద్దరు ఉద్యోగులు పని చేయక పోవడంతో దానిని మూసి వేస్తున్నట్లు ప్రకటించారు ట్విట్టర్ బాస్ ఎలాన్ మస్క్.
Also Read : హ్యాకర్ ఎక్స్ పర్ట్ జార్జ్ హాట్జ్ కు మస్క్ ఛాన్స్