Twitter CEO Coffee Serve : ట్విట్ట‌ర్ సిఇఓ సింప్లిసిటీకి ఫిదా

ఉద్యోగుల‌కు కాఫీ స‌ర్వ్ చేసిన ప‌రాగ్

Twitter CEO Coffee Serve : ప్ర‌పంచాన్ని శాసిస్తున్న ట్విట్ట‌ర్ సంస్థ సిఇఓ ప‌రాగ్ అగ‌ర్వాల్(Twitter CEO) ఇప్పుడు వ‌రల్డ్ వైడ్ గా హాట్ టాపిక్ గా మారారు. ఇప్ప‌టికే ఈ ప్ర‌వాస భార‌తీయుడు అత్యున్న‌త స్థానంలో ఉన్నాడు.

ఇటీవ‌ల ప్ర‌పంచ కుబేరుడు ఎలోన్ మ‌స్క్ కు మాత్రం సిఇఓ అంటే ప‌డ‌డం లేదు. ఆయ‌న ప్ర‌తీసారి టార్గెట్ చేస్తూ వ‌స్తున్నారు. ఇంకా ట్విట్ట‌ర్ టేకోవ‌ర్ పై కొలిక్కి రాలేదు.

మ‌రో వైపు ఎన్ని అవాంత‌రాలు వ‌చ్చినా సిఇఓగా కొలువు తీరిన ఈ భార‌తీయ ఐటీ దిగ్గ‌జం మాత్రం ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. త‌న‌దైన ప‌ని తీరుతో ఆక‌ట్టుకుంటూ ట్విట్ట‌ర్ సంస్థ‌లో ప‌ని చేస్తున్న ఎంప్లాయిస్ కు భ‌రోసా ఇస్తున్నాడు.

తాజాగా అరుదైన స‌న్నివేశానికి వేదికైంది లండ‌న్. విచిత్రం ఏమిటంటే ఈ సిఇఓను క‌ల‌వాలంటే నానా తంటాలు ప‌డాలి. ముందస్తుగా అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది.

దానిక పెద్ద క‌థ‌. కానీ అదే సిఇఓ ఉద్యోగులు ప‌ని చేస్తున్న వ‌ద్ద‌కు వ‌స్తే. ఆపై వాళ్లకు ఏం కావాలో అడిగి మ‌రీ టీ, బిస్కెట్స్ స‌ర్వ్ చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి.

ఇదంతా క‌ల అనుకుంటున్నారా. కాదు అక్ష‌రాలా వాస్త‌వం. ఈ అనుభూతికి లోనైంది మాత్రం ట్విట్ట‌ర్ ఉద్యోగులు. సిఇఓ ప‌రాగ్ అగ‌ర్వాల్ ఉద్యోగుల్లో ఒక‌రిలాగా క‌లిసి పోయాడు.

వారి నుంచి కాఫీ ఆర్డ‌ర్లు(Twitter CEO Coffee Serve) స్వీక‌రించి అందించాడు. ఇప్పుటు ఈ ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో వైర‌ల్ గా మారాయి. ఉద్యోగులే షేర్ చేశారు.

ఇక ట్విట్ట‌ర్ సిఇఓతో పాటు మ‌రో ఐటీ దిగ్గ‌జం చీఫ్ ఫైనాన్షియ‌ల్ ఆఫీస‌ర్ నెడ్ సెగ‌ల్ కూడా ఉద్యోగుల‌కు కాఫీ స‌ర్వ్ చేశాడు. ఇదిలా ఉండ‌గా నిరాడంబ‌రంగా ఉద్యోగుల‌తో మ‌మేక‌మైన సిఇఓను ప‌లువురు ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తుతున్నారు.

Also Read : ఫెమినా మిస్ ఇండియాగా సినీ శెట్టి

Leave A Reply

Your Email Id will not be published!