Elon Musk : ట్విట్టర్ ఆలస్యం త్వరలోనే పరిష్కారం – మస్క్
టెక్నికల్ సమస్య ..త్వరలోనే పరిష్కారం
Elon Musk : ట్విట్టర్ ను టేకోవర్ చేసుకున్న టెస్లా సిఇఓ, చైర్మన్ ఎలాన్ మస్క్(Elon Musk) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే తొలగించిన ఉద్యోగులలో కొందరిని తీసుకోనున్నట్లు తెలిపాడు. ఇదే సమయంలో మస్క్ స్వాధీనంలోకి తీసుకున్నాక ట్విట్టర్ పలు దేశాలలో గతంలో ఉన్నంత స్పీడ్ లేదు.
ప్రధానంగా ట్విట్టర్ కు ఎక్కువ మంది యూజర్లు ఇండియాలో ఉన్నారు. దీనిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు బాస్ మస్క్. ఇండియా ఒక్కటే కాదు ఇండోనేషియా, ఇతర దేశాలలో ట్విట్టర్ డౌన్లోడ్ విషయంలో స్లో గా ఉన్నమాట వాస్తవమేనని స్పష్టం చేశాడు.
తాను టేకోవర్ చేసుకున్నాక కీలక పదవులలో ఉన్న వారిని తొలగించానని, మరికొన్ని విభాగాలలో లేక పోవడం వల్ల కొంత టెక్నికల్ గా లోపం ఏర్పడిందని తెలిపారు. త్వరలోనే అన్నింటిని పరిష్కరిస్తామని స్పష్టం చేశారు ఎలాన్ మస్క్(Elon Musk).
హోమ్ లైన్ ట్వీట్ లు రీఫ్రెష్ చేసేందుకు 10 నుండి 15 సెకన్ల సమయం సాధారణంగా పడుతుందన్నాడు ట్విట్టర్ చీఫ్. ప్రధానంగా ఆండ్రాయిడ్ ఫోన్లలో బ్యాండ్ విడ్త్ , లేటెన్సీ, యాప్ కారణంగా ఎంత ఆలస్యం అవుతుందనేది ఒక్కటే ప్రశ్న అని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఎలాన్ మస్క్ ట్వీట్ చేశాడు.
ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశాడు. ట్విట్టర్ చాలా నెమ్మదిగా ఉన్నందుకు, ఈ అసౌకర్యానికి క్షమాపణలు చెప్పాలని అనుకుంటున్నట్లు పేర్కొన్నాడు.
ట్విట్టర్ లో పని చేస్తున్న పలువురు ఇంజనీర్లు ఈ విషయం నాతో చెప్పారని తెలిపాడు. త్వరలోనే పరిష్కారం జరుగుతుందన్నారు. ప్రస్తుతం ట్విట్టర్ లో 1200 సర్వర్స్ పని చేస్తున్నాయని వాటిలో 40 కీలకమని తెలిపాడు.
Also Read : హోసూర్ లో ఐఫోన్ తయారీ యూనిట్