Sidhu Killers Arrest : సిద్దూ హత్య కేసులో మరో ఇద్దరు అరెస్ట్
వెల్లడించిన ఢిల్లీ పోలీసులు
Sidhu Killers Arrest : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పంజాబ్ పాప్ గాయకుడు సిద్దూ మూసే వాలా హత్య కేసులో మరో పురోగతి సాధించారు పోలీసులు. ఇప్పటికే ఈ హత్యపై దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది.
ప్రధాన షూటర్లలో లారెన్స్ బిష్ణయ్ , గోల్డీ బ్రార్ గ్యాంగ్ కు చెందిన ఇద్దరు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ ఉన్నారని ఢిల్లీ పోలీసులు తెలిపారు.
ఆ ఇద్దరి హంతకుల నుంచి ఆయుధాలు, మూడు పంజాబీ పోలీస్ యూనిఫారాలు , రెండు మొబైల్ హ్యాండ్ సెట్స్ తో పాటు ఒక డాంగిల్ , ఒక సిమ్
కూడా స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
అరెస్ట్ చేసిన వారిలో అంకిత్ సిర్సా, సచిన్ భివానీలను ఆదివారం ఢిల్లీ లోని కాశ్మీర్ గేట్ బస్టాండ్ లో అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.
సింగర్ సిద్దూ మూసేవాలా పై విచక్షణా రహితంగా కాల్పులు జరిపిన వారిలో ఒకరు షార్ప్ షూటర్ అంకిత్ సిర్సా ఉన్నారని తెలిపారు. ఇదే హత్య
కేసులో నలుగురు షూటర్లకు ఆశ్రయం కల్పించిన సచిన్ భివానీని అరెస్ట్(Sidhu Killers Arrest) చేశామన్నారు.
సిద్దూ హత్యకు సంబంధించి ఈ ఇద్దరి క్రిమినల్స్ ను అరెస్ట్ చేసిన విషయాన్ని సోమవారం ధ్రువీకరించారు ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ కి చెందిన కమిషనర్ ఆఫ్ పోలీస్ . మీడియాతో మాట్లాడారు.
వివరాలు వెల్లడించారు. హర్యానా లోని సోనిపట్ కు చెందిన అంకిత్ రాజస్తాన్ లో హత్యయత్నానికి పాల్పడిన మరో రెండు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని తెలిపారు.
షూటర్లలో అత్యంత పిన్న వయస్సు కలిగిన వ్యక్తి అని పేర్కొన్నారు. ఇక రాజస్తాన్ లో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కార్యకలాపాలన్నింటినీ నిర్వహించే
ప్రధాన వ్యక్తి భివానీ అని చెప్పారు.
ఆ ఇద్దరు నేరస్తుల నుంచి 10 లైవ్ కాట్రిడ్జ్ లతో పాటు ఒక 9 ఎంఎం బోర్ పిస్టల్ , 30 ఎంఎం బోర్ తో పాటు 9 లైవ్ కాట్రిడ్జ్ లను స్వాధనీం చేసుకున్నట్లు వెల్లడించారు.
Also Read : లోయలో పడ్డ బస్సు 16 మంది మృతి