Tyagi JDU : కేంద్రంపై మిత్ర ప‌క్షం ఆగ్ర‌హం

ధ‌రా భారం మోప‌ద్ద‌ని విన్న‌పం

Tyagi JDU : ఇటీవ‌ల దేశంలోని ఐదు రాష్ట్రాల‌లో ఎన్నిక‌లు ముగిశాయి. నాలుగు రాష్ట్రాల‌లో బీజేపీ రెండో సారి అధికారంలోకి వ‌చ్చింది. ఎన్నిక‌ల సంద‌ర్భంగా చ‌మురు, గ్యాస్ కంపెనీలు ధ‌రా భారాన్ని మోపుతూనే ఉన్నాయి.

దీనిపై దేశ వ్యాప్తంగా ఆందోళ‌న వ్య‌క్తం అవుతోంది. గ‌త 14 రోజుల నుంచి రోజుకు పెట్రోల్ లీట‌ర్ కు 80 పైస‌లు, డీజిల్ లీట‌ర్ కు 90 పైస‌లు పెంచుతూ వ‌చ్చింది. గ‌త రెండు వారాల్లో మొత్తం ధ‌ర‌లు లీట‌రుకు రూ. 9.20కి పెరిగాయి.

ఇంధ‌న ధ‌ర‌ల పెంపును వ్య‌తిరేకిస్తూ భార‌తీయ జ‌న‌తా పార్టీ మిత్ర‌ప‌క్షం కూడా ఇంధ‌న ధ‌ర‌ల పెంపును వ్య‌తిరేకించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఈ ధ‌రాభారం ద్ర‌వ్యోల్బణానికి చేటు అని పాల‌క జాతీయ ప్రజాస్వామ్య కూట‌మి – ఎన్డీఏ – బీజేపీ మిత్ర‌పక్షం జ‌న‌తాద‌ళ్ స‌భ్యుడు త్యాగి (Tyagi JDU)తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు.

ఆ పార్టీకి ఆయ‌న ప్రిన్సిప‌ల్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీగా ఉన్నారు. ఆయిల్ ధ‌ర‌ల పెంపుద‌ల‌ను వెన‌క్కి తీసుకోవాలంటూ పిలుపునిచ్చారు. ఇదిలా ఉండ‌గా రోజు రోజుకు పెంచుకుంటూ పోతే శ్రీ‌లంక ప‌రిస్థితే భార‌త్ లో ఎదుర‌వుతుంద‌ని హెచ్చ‌రించారు.

పెట్రోల్, డీజిల్ మంట మండుతుండ‌గా గ్యాస్ ధ‌రా భారం మ‌రింత పెరుగుతోంది. ఇప్ప‌టికే ఆయిల్ , గ్యాస్ కంపెనీలు పెంచ‌డంలో పోటీ ప‌డుతున్నాయి.

ప్ర‌భుత్వం వెంట‌నే పెంచిన వాటిని త‌గ్గించాల‌ని, క‌నీసం పెంచ‌కుండా నియంత్రించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. ప్ర‌స్తుతం త్యాగి చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర క‌ల‌క‌లం రేపాయి మోదీ స‌ర్కార్ లో.

Also Read : తెలంగాణ కాంగ్రెస్ కు బాస్ చికిత్స

Leave A Reply

Your Email Id will not be published!