Assam CM : అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సంచలన కామెంట్స్ చేశారు. ఆయన యూనిఫాం సివిల్ కోడ్ (ఉమ్మడి పౌర స్మృతి) రావాల్సిందేనని డిమాండ్ చేశారు.
ముస్లిం మహిళలు, తల్లులకు సమాజం రావాలంటే ట్రిపుల్ తలాక్ తర్వాత యూసీసీ అమలు లోకి రావాల్సిన అవ సరం ఉందని అభిప్రాయ పడ్డారు. ఏ ముస్లిం మహిళ కూడా తన భర్తకు ముగ్గురు భార్యలను కలిగి ఉండాలని అనుకోవడం లేదన్నారు.
సీఎం హిమంత శర్మ (Assam CM)ఆదివారం ఢిల్లీలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీని కలిశారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అమలు చేసేందుకు గాను యూసీసీ ముసాయిదాను బీజేపీ ప్రభుత్వం సిద్దం చేస్తోందని ఈ సందర్బంగా ధామి చెప్పారు.
తనను కలిసిన ముస్లింలు సైతం యూసీసీ రావాలని కోరుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా అస్సాం సీఎం మీడియాతో మాట్లాడారు.
ఏ ఒక్కరు కూడా ఒకే భర్తకు ముగ్గురు భార్యలు ఉండాలని కోరుకుంటారా. ఇదెక్కడి న్యాయం. సభ్య సమాజం ఏమని అనుకుంటోంది. వాళ్లు రేపటి తరానికి ఏం సందేశం ఇస్తారో చెప్పాలన్నారు.
ఏ మహిళ దీనిని ఒప్పుకోదు. ప్రత్యేకించి ముస్లిం మహిళలు ఒప్పుకోరని అన్నారు. ముస్లిం పురుషుడు ఒకరి కంటే ఎక్కువ మంది మహిళలను పెళ్లి చేసుకోవడం సమస్య కాదన్నారు.
అయితే ముస్లిం తల్లులు , సోదరీమణుల వ్యక్తిగత సమస్యగా ఆయన అభివర్ణించారు. నేను హిందువుని నాకు యూసీసీ ఉంది. నా చెల్లెలు, కూతురుకు కూడా ఉంది.
నా కూతురికి యూసీసీ ఉంటే ముస్లిం కూతుళ్లకు కూడా రక్షణ ఉంటుందన్నారు అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ.
Also Read : ఆ ప్రాంతాల్ని కలిపేసుకుంటాం