Uddhav Thackeray : తల వంచను తప్పుకుంటా – ఠాక్రే
రెబల్ ఎమ్మెల్యేలతో చర్చకు సిద్దం
Uddhav Thackeray : మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం నెలకొంది. ఈ తరుణంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మరో వైపు ధిక్కార స్వరం వినిపించిన మంత్రి ఏక్ నాథ్ షిండే , ఎమ్మెల్యేలు గుజరాత్ నుంచి అస్సాంలోని గౌహతికి మకాం మార్చారు.
ఈ సందర్భంగా షాకింగ్ కామెంట్స్ చేశారు సీఎం ఉద్దవ్ ఠాక్రే(Uddhav Thackeray). తిరుగుబాటు ఎమ్మెల్యేలు నా వద్దకు రావాలని కోరారు. పాలన తనకు చేతకాదని నిరూపిస్తే తాను రాజీనామా చేసేందుకు సిద్దంగా ఉన్నానని స్పష్టం చేశారు సీఎం.
ఎలాంటి జంకు లేకుండా ఇక్కడికి రావచ్చన్నారు. తాను ఏనాడూ కుర్చీ కోసం పాకులాడ లేదన్నారు. ఇదే సమయంలో తన పాత్రను వదులుకునేందుకు సిద్దంగా ఉన్నానని ప్రకటించారు ఉద్దవ్ ఠాక్రే. తన రాజీనామా లేఖ తన వద్దే ఉందన్నారు.
రెబల్ ఎమ్మెల్యేలు వచ్చి తనపై నమ్మకం లేదని చెబితే ఓకే అన్నారు. తాను సీఎం పదవికి రాజీనామా చేసిన తర్వాత శివసేన నుంచి ఎవరో ఒకరిని సీఎంగా తీసుకుంటారని చెప్పారు ఉద్దవ్ ఠాక్రే(Uddhav Thackeray).
ఇదిలా ఉండగా సీఎంకు కరోనా పాజిటివ్ సోకడంతో ఇవాళ ఆయన వర్చువల్ గా ప్రసంగించారు. ఫేస్ బుక్ లైవ్ సెషన్ ద్వారా రాష్ట్రాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.
శివసేన ఎప్పటికీ హిందూత్వను విడిచి పెట్టదని స్పందించారు. బాలా సాహెబ్ థాకరే ఇదే విషయాన్ని పార్టీ కార్యకర్తలకు బోధించారని అన్నారు.
సాధారణ శివ సైనికులు తనతో ఉన్నంత వరకు తాను ఎలాంటి సవాళ్లకు భయపడనని హెచ్చరించారు సీఎం. ఒక్క ఎమ్మెల్యే తనను విభేదించి అది తన క్యారెక్టర్ కు అవమానకరమన్నారు ఠాక్రే.
Also Read : ‘శివ’ సైనికుల కంటతడి