Uddhav Thackeray : ద‌మ్ముంటే మ‌ధ్యంత‌ర ఎన్నిక‌లు చేప‌ట్టండి

స‌వాల్ విసిరిన మాజీ సీఎం ఉద్ద‌వ్ థాక‌రే

Uddhav Thackeray : మాజీ సీఎం, శివ‌సేన పార్టీ చీఫ్ ఉద్ద‌వ్ ఠాక్రే(Uddhav Thackeray) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ద‌మ్ముంటే మ‌ధ్యంత‌ర ఎన్నిక‌ల‌కు రావాల‌ని స‌వాల్ విసిరారు. శుక్ర‌వారం రాజీనామా చేసిన అనంత‌రం తొలిసారిగా ప్ర‌సంగించారు.

మ‌రాఠా యోధుడు స్థాపించిన శివ‌సేన పార్టీ పేరును, గుర్తును ఎవ‌రు వాడుకున్నా స‌హించ బోమ‌ని హెచ్చ‌రించారు. పార్టీని వీడిన వారంతా ద్రోహులేన‌ని అన్నారు.

రాజ‌కీయ ప‌ద‌వుల కోసం విలువ‌ల్ని తాక‌ట్టు పెట్టే వారిని ప్ర‌జ‌లు క్ష‌మించ‌ర‌ని పేర్కొన్నారు. త‌మ మీద త‌మ‌కు న‌మ్మ‌కం ఉంటే వెంట‌నే ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేసి ఎన్నిక‌ల్లోకి రావాల‌ని పిలుపునిచ్చారు.

అప్పుడు ఎవ‌రు నిజ‌మైన శివ‌సైనికులు అని పేర్కొన్నారు. ఇవాళ మ‌మ్మ‌ల్ని కూల దోశారు. కానీ రేపొద్దున కూడా మీరు కూలి పోర‌న్న గ్యారెంటీ ఏమిటి అని ఉద్ద‌వ్ ఠాక్రే ప్ర‌శ్నించారు.

వ్య‌వ‌స్థ‌ల‌ను స‌ర్వ నాశ‌నం చేసి ఉన్న ప్ర‌భుత్వాల్ని కూల్చ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్న వాళ్లు నీతులు బోదించ‌డం చూస్తే న‌వ్వు వ‌స్తోంద‌న్నారు.

ఎప్ప‌టికీ ఎన్న‌టికీ శివ‌సేన ఇంకొక‌రి వశం కాద‌న్నారు. బాలా సాహెబ్ ఠాక్రే వార‌స‌త్వం త‌మ‌కు త‌ప్ప ఇంకొక‌రికి లేద‌ని స్ప‌ష్టం చేశారు.

ఈనెల 11న సుప్రీంకోర్టు వెలురించే తీర్పు కేవ‌లం శివ‌సేన పార్టీకి చెందిన‌దే కాకుండా భార‌త ప్ర‌జాస్వామ్య భ‌విష్య‌త్తును నిర్ణ‌యిస్తుంద‌ని చెప్పారు ఉద్ద‌వ్ ఠాక్రే.

శివ‌సేన‌కు చెందిన విల్లు, బాణం చిహ్నాన్ని ఎవ‌రూ తీసి వేయ‌లేర‌న్నారు. గ‌త నెల 29న రాజీనామా చేశాక మొద‌టిసారి బ‌హిరంగంగా ప్ర‌సంగించ‌డం ఉద్ద‌వ్ ఠాక్రే(Uddhav Thackeray). న్యాయ వ్య‌వ‌స్థ‌పై త‌మ‌కు అపార‌మైన న‌మ్మ‌కం ఉంద‌న్నారు.

Also Read : సీఎం షిండేకు పెరుగుతున్న మ‌ద్ద‌తు

Leave A Reply

Your Email Id will not be published!