Uddhav Thackeray : శివసేన పార్టీ అంతానికి కేంద్రం కుట్ర
సంజయ్ రౌత్ అరెస్ట్ పై ఉద్దవ్ ఫైర్
Uddhav Thackeray : మరాఠా రాజకీయాలు మరింత వేడిక్కిస్తున్నాయి. ఆరోపణలు కేసులు అరెస్ట్ లతో దద్దరిల్లుతోంది. ఓ వైపు గవర్నర్ చేసిన కామెంట్స్ తో అట్టుడుకుతుంటే మరో వైపు కేంద్రంపై ధిక్కార స్వరాన్ని వినిపిస్తూ వస్తున్న శివసేన అగ్ర నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ ను కేంద్ర దర్యాప్తు సంస్థ అరెస్ట్ చేసింది.
దీంతో మహారాష్ట్రలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ తరుణంలో శివసేన పార్టీ చీఫ్, మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే సంచలన కామెంట్స్ చేశారు.
మరాఠా యోధుడు బాలా సాహెబ్ ఠాక్రే స్థాపించిన శివసేనను నామ రూపాలు లేకుండా చేయాలనే ఉద్ధేశంతో కేంద్ర ప్రభుత్వం యత్నిస్తోందంటూ సంచలన ఆరోపణలు చేశారు.
రౌత్ ను అదుపులోకి తీసుకున్న అనంతరం ఉద్దవ్ ఠాక్రే(Uddhav Thackeray) ఆదివారం పార్టీకి చెందిన ముఖ్య నేతలు, శ్రేణులతో సమావేశం అయ్యారు. రౌత్ అరెస్ట్ పార్టీని అంతం చేసే కుట్రలో భాగమన్నారు.
ఓ వైపు సోదాలు జరుగుతుండగా ఉద్దవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రోజు రోజుకు ఎంత మందిని అరెస్ట్ చేసినా లేదా కేసులు నమోదు చేసినా శివసేన ఎప్పుడూ తల వంచదని స్పష్టం చేశారు.
మరింత బలోపేతం అవుతుందన్నారు పార్టీ చీఫ్. ఇది పూర్తిగా కక్ష సాధింపు చర్య. ఇంతకంటే ఏం చేయగలరు. కేసులు పెట్టగలరు జైళ్లలో పెట్టగలరు. అంతకంటే ఏం చేయగలరని ప్రశ్నించారు ఉద్దవ్ ఠాక్రే(Uddhav Thackeray).
రాజకీయంగా ఎదిగేందుకు శివసేన సహకరించిన వ్యక్తులు ఇప్పుడు విధేయతను మార్చుకుంటున్నారని ఆరోపించారు. మరాఠా యోధులను అవమానించిన గవర్నర్ కు కొల్హాపురి చప్పుళ్లు వినిపించాలని పిలుపునిచ్చారు.
Also Read : చంపినా ప్రశ్నిస్తూనే ఉంటా – సంజయ్ రౌత్