Amit Shah : ఉద్దవ్ ఠాక్రేకు గుణపాఠం చెప్పాలి – షా
సంచలన కామెంట్స్ చేసిన హోం మంత్రి
Amit Shah : కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా(Amit Shah) షాకింగ్ కామెంట్స్ చేశారు. సోమవారం ఆయన శివసేనపై నిప్పులు చెరిగారు. శివసేన పార్టీ చీఫ్, మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రేకు తగిన రీతిలో గుణపాఠం చెప్పాలన్నారు.
సోమవారం మహారాష్ట్ర లోని ముంబైలో జరిగిన భారతీయ జనతా పార్టీ సమావేశంలో అమిత్ షా పాల్గొని ప్రసంగించారు. బీజేపీకి ప్రధాన వ్యూహకర్తగా పేరొందారు.
ఒక రకంగా ట్రబుల్ షూటర్ గా ఎప్పటికప్పుడు కీలక నేతగా ఉంటూ వచ్చారు. ఆయన ఏది చెబితే అది. పేరుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అయినప్పటికీ అమిత్ షానే కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు.
ఎవరిని మార్చాలన్నా లేక ఎవరితోనైనా పొత్తు పెట్టు కోవాలన్నా ముందు అమిత్ షాను కలవాల్సిందే. అంతలా కీలకమైన నాయకుడిగా ప్రస్తుతం ఉన్న ఆయన ఇటీవల శివసేనను టార్గెట్ చేశారు.
ఆ పార్టీలో తిరుగుబాటు జెండా ఎగుర వేసిన ఏక్ నాథ్ షిండేకు(Eknath Shinde) ఫుల్ సపోర్ట్ చేశారు. ఆపై మరాఠాలో శివసేన సంకీర్ణ సర్కార్ మహా వికాస్ అఘాడి ను పడగొట్టారు.
చివరకు ఏక్ నాథ్ షిండే నేతృత్వంలో బీజేపీ సపోర్ట్ తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దీని వెనుక అమిత్ షా ప్లాన్ ఉందని ఇప్పటికే పలుమార్లు సంచలన ఆరోపణలు చేస్తూ వస్తున్నారు .
ఆయన ఉద్దవ్ ఠాక్రేను(Uddhav Thackeray) టార్గెట్ చేశారు. ఠాక్రే బీజేపీకి ద్రోహం చేశారని , ఆయనకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు అమిత్ చంద్ర షా. తాము రాజకీయాలలో దేన్నైనా సహిస్తాం కానీ ద్రోహాన్ని, మోసాన్ని సహించ బోమంటూ స్పష్టం చేశారు.
Also Read : ఒత్తిడి తట్టుకోలేక సీబీఐ ఆఫీసర్ సూసైడ్