Uddhav Thackeray : కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించండి
సరిహద్దు వివాదంపై తీవ్ర ఆగ్రహం
Uddhav Thackeray : ఏక్ నాథ్ షిండే తిరుగుబాటు తర్వాత జూన్ లో మహా వికాస్ అఘాడి ప్రభుత్వం కూలి పోయింది. భారతీయ జనతా పార్టీ మద్దతుతో ఏక్ నాథ్ షిండే సర్కార్ ఏర్పాటు చేసింది. అనంతరం తొలిసారిగా సోమవారం మరాఠా శాసన మండలి ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆసక్తికర సన్నివేశాలకు వేదికైంది ఇవాల్టీ కౌన్సిల్. కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన సభ్యులతో కలిసి సందడి చేశారు.
పాలక కూటమి నాయకుల మధ్య పదునైన వ్యాఖ్యలు చోటు చేసుకున్నాయి. ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతం ఏర్పాటు చేయాలని ఉద్దవ్ ఠాక్రే డిమాండ్ చేయడంతో హై డ్రామా నెలకొంది. శాసన మండలిని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ సీఎం. కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో మరాఠీ మాట్లాడే ప్రజల సమస్యలను లేవనెత్తారు.
వివాదం పరిష్కారం అయ్యేంత వరకు ఆ ప్రాంతాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చాలని ఉద్దవ్ ఠాక్రే డిమాండ్ చేశారు. ఈ విషయంలో కర్ణాటక సీఎం బస్వరాజ్ బొమ్మై దూకుడు ప్రదర్శిస్తుండగా మరాఠా సీఎం ఏక్ నాథ్ షిండే మాత్రం మౌనంగా ఉన్నారంటూ మండిపడ్డారు.
ఈ అంశంపై సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకునేంత వరకు బెలగావి, కార్వార్ లను కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించాలని, అసెంబ్లీలో ఆమోదించే ప్రతిపాదనలో దీనిని చేర్చాలని ఉద్దవ్ ఠాక్రే(Uddhav Thackeray) డిమాండ్ చేశారు.
ఇదిలా ఉండగా మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దు వివాదంపై మంగళవారం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశ పెడతామని స్పష్టం చేశారు మరాఠా డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. అంగుళం భూమి కూడా వదులుకునే ప్రసక్తి లేదని పేర్కొన్నారు.
Also Read : కాశ్మీరీ పండిట్లను జమ్మూకు పంపాలి