Uddhav Thackeray : మరాఠా ఆత్మ గౌరవానికి అవమానం
గవర్నర్ కామెంట్స్ పై ఉద్దవ్ ఠాక్రే
Uddhav Thackeray : నిన్నటి దాకా దేశాన్ని కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి కామెంట్ కలకలం రేపితే ఇవాళ మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.
ప్రశాంతంగా ఉన్న మరాఠాలో అల్లకల్లోలం అయ్యేలా చేశాయి. గుజరాతీలు, రాజస్థానీలు గనుక ఈ రాష్ట్రం నుంచి వెళ్లిపోతే ఖాళీ తప్ప ఇక్కడ ఏమీ ఉండదన్నారు.
ఆపై దేశ ఆర్థిక రాజధానిగా ముంబై కనుమరుగవుతుందని పేర్కొన్నారు గవర్నర్. ఈ కామెంట్స్ పై అన్ని పార్టీలకు చెందిన భగ్గుమంటున్నారు.
బేషరతుగా క్షమాపణలు చెప్పాలని లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కాంగ్రెస్ పార్టీ చీఫ్ నానా పటోలే హెచ్చరించారు.
కోష్యారీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని , బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు శివసేన పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సంజయ్ రౌత్. తాజాగా ఆ పార్టీ చీఫ్, మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే(Uddhav) కీలక వ్యాఖ్యలు చేశారు.
గవర్నర్ తన స్థాయిని మరిచి దిగజారి వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. ఒక రకంగా ఆయన కావాలనే కామెంట్ చేసినట్లు అర్థం అవుతోందన్నారు. శనివారం గవర్నర్ కామెంట్స్ పై స్పందించారు ఉద్దవ్ ఠాక్రే.
మరాఠా ప్రజల ఆత్మ గౌరవంపై దెబ్బ కొట్టారంటూ నిప్పులు చెరిగారు. మరాఠాలపై తూల నాడిన గవర్నర్ ను ఇంటికి పంపిస్తారా లేక జైలుకు పంపిస్తారా అంటూ కేంద్రాన్ని నిలదీశారు మాజీ సీఎం.
బేషరతుగా మరాఠా ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
Also Read : గవర్నర్ కామెంట్స్ పై కాంగ్రెస్ కన్నెర్ర