Uddhav Thackeray : బ‌స్వ‌రాజ్ బొమ్మైపై భ‌గ్గుమ‌న్న ఉద్ద‌వ్ ఠాక్రే

ముదిరిన మ‌హారాష్ట్ర - క‌ర్ణాట‌క స‌రిహ‌ద్దు వివాదం

Uddhav Thackeray : శివ‌సేన పార్టీ చీఫ్‌, మ‌రాఠా మాజీ సీఎం ఉద్ద‌వ్ ఠాక్రే(Uddhav Thackeray) నిప్పులు చెరిగారు. మ‌హారాష్ట్ర – క‌ర్ణాట‌క రాష్ట్రాల మ‌ధ్య గ‌త కొంత కాలంగా స‌రిహ‌ద్దు వివాదం కొన‌సాగుతూ వ‌స్తోంది. ఇరు రాష్ట్రాల‌కు సంబంధించి కేసు సుప్రీంకోర్టులో న‌డుస్తోంది.

తాజాగా మ‌హారాష్ట్ర లోని సాంగ్లీ జిల్లాలో నీటి ఎద్ద‌డి నెల‌కొన్న కొన్ని గ్రామాల‌ను క‌ర్ణాట‌క‌లో విలీనం చేయాల‌ని కోరుతూ తీర్మానం చేశామ‌ని ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి బ‌స్వ‌రాజ్ బొమ్మై ప్ర‌క‌టించారు. దీంతో మ‌హారాష్ట్ర , క‌ర్ణాట‌క మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతున్నాయి.

సీఎం చేసిన వ్యాఖ్య‌ల‌ను తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. మ‌హారాష్ట్ర‌లోని 40 గ్రామాలు తమ‌వేనంటూ దావా వేయ‌డం సిగ్గు చేటు అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు ఉద్ద‌వ్ ఠాక్రే.

బొమ్మై త‌న ప‌రిధి దాటి ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని మండిప‌డ్డారు. ఇదే స‌మ‌యంలో మ‌హారాష్ట్ర ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు అజిత్ ప‌వార్ సైతం క‌ర్ణాట‌క సీఎం చేసిన తీర్మానం పూర్తిగా అప్ర‌జాస్వామ్య‌మ‌ని పేర్కొన్నారు.

ఇది మ‌రాఠా ప్ర‌జ‌ల‌ను అవ‌మానించ‌డ‌మేన‌ని ధ్వ‌జ‌మెత్తారు. బొమ్మై(Basavaraj Bommai) చేసిన వ్యాఖ్య‌ల‌నుత తీవ్రంగా ఖండించారు. కేంద్రంలో కొలువు తీరిన బీజేపీ ప్ర‌భుత్వం ఏం చేస్తుందంటూ ప్ర‌శ్నించారు.

ఇదిలా ఉండ‌గా అటు క‌ర్ణాట‌క లోనూ ఇటు మ‌హారాష్ట్ర లోనూ బీజేపీకి చెందిన ప్ర‌భుత్వాలే ఉన్నాయి. ఇంత జ‌రుగుతున్నా మ‌రాఠా సీఎం ఏక్ నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ నిద్ర పోతున్నారా అంటూ ఫైర్ అయ్యారు శివ‌సేన పార్టీ జాతీయ అధికార ప్ర‌తినిధి సంజ‌య్ రౌత్. ఈ వివాదం మ‌రింత ముదిరే అవ‌కాశం ఉంది.

Also Read : ఉద‌య‌నిధి స్టాలిన్ కే మ‌ళ్లీ ప‌ట్టం

Leave A Reply

Your Email Id will not be published!