Uddhav Thackeray : నమ్మిన వాళ్లే నట్టేట ముంచారు – ఠాక్రే
రెబల్ ఎమ్మెల్యేలపై తీవ్ర ఆగ్రహం
Uddhav Thackeray : శివసేన పార్టీ చీఫ్, మహారాష్ట్ర ఆపద్దర్మ ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే(Uddhav Thackeray) సంచలన కామెంట్స్ చేశారు. విలువలకు కట్టుబడి తాము ఇప్పటి దాకా ప్రభుత్వాన్ని నడిపిస్తూ వచ్చామన్నారు. కానీ నమ్ముకున్న వాళ్లే వెన్నుపోటు పొడిచారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
శనివారం ఆయన వర్చువల్ గా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియా గాంధీ, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సంపూర్ణంగా మద్ధతు తెలిపారు. చివరి వరకు మాకు అండగా నిలిచారని ప్రశంసించారు.
నిన్న పవార్ నాతో కలిశారు. ప్రస్తుతం తాను క్వారంటైన్ లో ఉండాల్సి వచ్చిందన్నారు. కానీ ప్రజలు వీటన్నింటిని గమనిస్తూ వస్తున్నారని చెప్పారు. వారు చేస్తున్నది తప్పు. కాంగ్రెస్, ఎన్సీపీ ఇప్పటి వరకు మాతోనే ఉన్నారు.
కానీ మా పార్టీకి చెందిన వాళ్లే మమ్మల్ని వీడి పోవాలని నిర్ణయం తీసుకోవడం తనను ఎంతో బాధకు గురి చేసిందని చెప్పారు ఉద్దవ్ ఠాక్రే(Uddhav Thackeray). ఇది పూర్తిగా చట్ట విరుద్దమన్నారు. ఇవాళ ఎవరో అండ చూసుకుని మీరు ఇలా చేస్తున్నారు.
కానీ ఇలా ఎంత కాలం గౌహతి, లేదా ఇతర ప్రాంతాలలో ఉండగలరని ప్రశ్నించారు. ఏదో ఒక రోజు మరాఠాలో కాలు మోపాల్సిందే. ఆనాడైనా మీరు చేసిన పనికి మీరు తప్పక పశ్చాతాపం పడాల్సి వస్తుందన్నారు సీఎం.
ఇలా వెన్నుపోటు పొడుస్తారని తాను కలలో కూడా అనుకోలేదన్నారు. గెలవలేని వారికి కూడా టికెట్లు ఇచ్చామన్నారు. దగ్గరుండి వారిని గెలిపిస్తే చివరకు ప్రత్యర్థులతో చేతులు కలిపి ఉన్న సర్కార్ కు ఎసరు పెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : రెబల్స్ కు డిప్యూటీ స్పీకర్ ఝలక్