Uddhav Thackeray : ముంబైకి ద్రోహం తలపెడితే ఊరుకోను
మెట్రో కార్ షెడ్ ను మార్చకండి
Uddhav Thackeray : మహా వికాస్ అఘాడీ సర్కార్ పై ధిక్కార స్వరం వినిపించి ఏకంగా సీఎం పీఠం ఎక్కిన ఏక్ నాథ్ షిండే ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఉద్దవ్ ఠాక్రేను టార్గెట్ చేశారు.
ఆయన తీసుకున్న నిర్ణయాలపై ఫోకస్ పెట్టారు. తాజాగా వివాదాస్పంగా మారిన మెట్రో కార్ షెడ్ పై స్పందించారు. ఈ మేరకు మెట్రో కార్ షెడ్ ను ఆరే కాలనీకి మార్చాలని నిర్ణయించారు.
దీనిపై పెద్ద రాద్దాంతం కొనసాగుతోంది. ఇది 2019లో అప్పటి సీఎంగా ఉన్న ఫడ్నవీస్ కాలంలో కొనసాగింది. పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.
ఇదే సమయంలో ఆ స్థలం కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుందంటూ బాంబే హైకోర్టును ఆశ్రయించింది. దీంతో కోర్టు స్టే విధించింది. తాజాగా షిండే దీనిని మార్చాలని ఆదేశించడంపై నిప్పులు చెరిగారు మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే(Uddhav Thackeray) .
కొలువు తీరిన కొత్త ప్రభుత్వానికి గ్రీటింగ్స్ తెలిపారు. ఆపై సీఎం ఏక్ నాథ్ షిండేపై నిప్పులు చెరిగారు. అసలైన సీఎం నువ్వు కాదంటూ పేర్కొన్నారు. మెట్రో ప్రాజెక్టులపై కొత్త సర్కార్ ముందుకు వెళ్లరాదంటూ హెచ్చరించారు.
శుక్రవారం ముంబై లోని శివ సేన భవన్ లో ఉద్దవ్ ఠాక్రే మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లో మెట్రో కార్ షెడ్ ను ఆరే కాలనీకి మార్చవద్దని హెచ్చరించారు. ముంబై పర్యావరణానికి ముప్పు తెచ్చే లా చేయొద్దంటూ కోరారు.
కాదని ముందుకు వెళితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు షిండేకు. నాకు ద్రోహం చేసినా పర్వాలేదు. కానీ ముంబైకి మోసం చేయొద్దన్నారు.
Also Read : దేవేంద్ర ఫడ్నవీస్ మొదటి అగ్నివీర్