Uddhav Thackeray Party Symbol : పార్టీ గుర్తు మార్పుపై సుప్రీంకోర్టుకు
పార్టీ గుర్తు మార్పుపై సుప్రీంకోర్టుకు
Uddhav Thackeray Party Symbol : కేంద్ర ఎన్నికల సంఘం కోలుకోలేని షాక్ ఇచ్చింది శివసేన పార్టీ చీఫ్ ఉద్దవ్ ఠాక్రేకు . మరాఠాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మహా వికాస్ అఘాడీలో శివసేన రెబల్ వర్గానికి ప్రస్తుత సీఎం ఏక్ నాథ్ షిండే నాయకత్వం వహించారు.
తమ మైపు ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నారు. తమదే అసలైన శివసేన పార్టీ అని, అందుకే విల్లు, బాణం తమకు కేటాయించాలని కోరారు ఈసీని. దీనిపై వాదోపవాదాలు జరిగాయి.
చివరకు కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. గత కొంత కాలంగా శివసేన పార్టీకి ఉన్న విల్లు, బాణం గుర్తును శివసేన వ్యతిరేక షిండే వర్గానికి కేటాయించింది. దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపారు మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే(Uddhav Thackeray Party Symbol). మరాఠాలో శివసేనను ఏర్పాటు చేసింది తమ తండ్రి, దివంగత బాలా సాహెబ్ ఠాక్రే అని, ఇందుకు సంబంధించిన విల్లు, బాణం తమకే చెందుతుందని స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వంలో కొలువు తీరిన కొందరి ఒత్తిళ్ల మేరకే కేంద్ర ఎన్నికల సంఘం ఇలాంటి నిర్ణయం తీసుకుందని ఆరోపించారు ఉద్దవ్ ఠాక్రే. ఇదిలా ఉండగా ఈసీఐ తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని పేర్కొన్నారు. ఈ మేరకు ఈసీఐ షిండేకు సింబల్ కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు స్పష్టం చేశారు మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే.
ఇదిలా ఉండగా పార్టీ గుర్తు మారడం వల్ల ఎలాంటి ప్రభావం పార్టీపై ఉండదని పేర్కొన్నారు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్.
Also Read : జార్జ్ సోరోస్ తో ఏకీభవించను – చిదంబరం