Ugadi Pachadi : తెలుగు వారందరికీ ప్రాణ ప్రదమైన ఉగాది పండుగ రానే వచ్చింది. ఏపీ, తెలంగాణతో పాటు దేశంలోని పలు ప్రాంతాలు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారంతా ఉగాదిని ఘనంగా జరుపుకుంటారు.
కొత్త పనులు చేపట్టేందుకు ఈ ఫర్వదినాన్ని శుభప్రదంగా భావిస్తారు. అంతే కాదు పండుగ రోజు ప్రత్యేకం ఏమిటంటే పచ్చడి(Ugadi Pachadi ). ఇది ఆరు రుచుల సమ్మేళనం. కానీ దాని వెనుక ఘనమైన చరిత్ర ఉన్నది.
కష్ట సుఖాలు, కలిమి లేములు అన్నింటిని సమ పాళ్లల్లో మేళవించి సాగి పోవడాన్ని సూచిస్తుంది ఈ పండుగ. తెలుగు వారంతా ఆది నుంచి నేటి దాకా యుగాలు మారినా తరాలు గడిచినా , టెక్నాలజీ విస్తరించినా సంప్రదాయం మారలేదు.
ప్రాంతాలు వేరైనా పర్వదినం రోజు అంతా ఒక్కటవుతారు. పచ్చడిని సేవిస్తారు. ఇది మనుషుల మధ్య, కుటుంబాల మధ్య అనుబంధాలను మరింత విస్తృతం చేస్తుందన్నది నమ్మకం.
అంతే కాదు ఉగాది నాడు ప్రారంభిస్తే అంతా శుభం కలుగుతుందని నమ్మకం. ఇక ఉగాది పచ్చడి (Ugadi Pachadi )ఈ పండుగకు ప్రత్యేకమైనది. ప్రశస్తమైనది.
షడ్రుచుల సమ్మేళం అంటే ఇందులో తీపి – మధురం, పులుపు – ఆమ్లం ..ఉప్పు – లవణం – కారం – కటు – చేదు – తిక్త – వగరు – కషాయం అనే ఆరు రుచులు కలిపి చేస్తారు దీనిని.
ఏడాది పొడవునా ఎదురయ్యే మంచి, చెడులు, కష్ట సుఖాలు సంయమనంతో స్వీకరించాలన్న సందేశమే ఈ ఉగాది పచ్చడి తెలియ చేస్తుంది. వీటితో పాటు అరటి పళ్లు, మామిడి కాయలు, వేప పువ్వు, చింత పండు, జామ కాయలు, బెల్లం వాడతారు.
Also Read : శ్రీశైలంలో ప్రశాంతం దర్శనం ప్రారంభం