TS CJ Ujjal Bhuyan : తెలంగాణ సీజేగా ఉజ్జల్ భూయాన్
జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ఢిల్లీకి బదిలీ
TS CJ Ujjal Bhuyan : తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉజ్జల్ భూయాన్ ను సిఫారసు చేసింది సుప్రీంకోర్టు కొలిజీయం. ఆయన సీజేగా నియమితులయ్యారు.
ఆయన స్థానంలో ఇక్కడ కొలువు తీరిన చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేయాలని సూచించింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం టీఎస్ హైకోర్టులో న్యాయమూర్తిగా పని చేస్తున్నారు ఉజ్జల్ భూయాన్ (TS CJ Ujjal Bhuyan).
ఆయన పనితీరుకు పదోన్నతి కల్పిస్తూ కొలిజీయం సీజేగా నియమించింది. ఇదే సమయంలో తెలంగాణ హైకోర్టుతో పాటు ఢిల్లీ, బాంబే, గుజరాత్ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల బదిలీలకు సైతం కొలిజీయం సిఫారసు చేసింది.
ఇదిలా ఉండగా కొత్తగా సీజేగా పదోన్నతి పొందిన ఉజ్జల్ భూయాన్ (TS CJ Ujjal Bhuyan) ది స్వస్థలం అసోం లోని గువహటి. ఆగష్టు 2, 1964 లో పుట్టారు. ఆయన తండ్రి కూడా గొప్ప లాయర్. ఆ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ గా కూడా పని చేశారు.
భూయాన్ ఉన్నత విద్యను కాటన్ కాలేజీలో చదివారు. ఢిల్లీలో డిగ్రీ సాధించారు. గువహటిలోని ప్రభుత్వ న్యాయ కళాశాలలో లా చదివారు. పట్టా పొందారు. గౌహతి విశ్వ విద్యాలయం నుంచి ఎల్ఎల్ఎం పట్టా కూడా తీసుకున్నారు.
1991లో బార్ కౌన్సిల్ ఆఫ్ అసోంలో పేరు నమోదు చేసుకున్నారు. గౌహతి హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా 2011 అక్టోబర్ 17న నియమితులయ్యారు.
అక్కడి నుంచి 2019లో బాంబే హైకోర్టుకు ట్రాన్స్ ఫర్ అయ్యారు. జడ్జీగా విశిష్ట సేవలు అందించారు. గత ఏడాది 2021న తెలంగాణ హైకోర్టుకు జడ్జిగా వచ్చారు.
అంతే కాదు తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి ఈసీగా ఉన్నారు ఉజ్జల్ భూయాన్.
Also Read : దమ్ముంటే దా తేల్చుకుందాం