UK Govt Crisis : ప్రమాదంలో ప్రభుత్వం బ్రిటన్ లో సంక్షోభం
ముగ్గురు మంత్రులు రాజీనామా
UK Govt Crisis : బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ కు కోలుకోలేని షాక్ తగిలింది. తన కేబినెట్ లో కీలక పదవులు నిర్వహిస్తున్న ముగ్గురు మంత్రులు గుడ్ బై చెప్పారు. దీంతో తీవ్ర సంక్షోభంలో కూరుకు పోయింది జాన్సన్ ప్రభుత్వం.
రోజు రోజుకు తీవ్ర సమస్యలతో బోరిస్ జాన్సన్ ప్రభుత్వాన్ని నెట్టుకొస్తున్నారు. ప్రస్తుతం సర్కార్ లో కొలువు తీరిన ఇద్దరు సీనియర్ మంత్రులు రాజీనామా చేశారు. ప్రవాస భారతీయుడైన ఆర్థిక శాఖ మంత్రి రిషి సునక్ తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
మరో వైపు పాకిస్తాన్ కు చెందిన ఆరోగ్య శాఖ మంత్రి సాజిద్ జావిద్ ఉన్నట్లుండి రిజైన్ చేయడం కలకలం రేపింది. ఇప్పటికే జాన్సన్ పై వ్యక్తిగత, అవినీతి ఆరోపణలు చుట్టుముట్టాయి.
ఇదే సమయంలో మంత్రులు తప్పు కోవడంతో ప్రభుత్వం ప్రమాదంలో పడింది. ఇదిలా ఉండగా రాజీనామా చేసిన మంత్రులు తమ లేఖల్లో తీవ్రమైన ఆరోపణలు చేశారు ప్రస్తుత ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్(UK Govt Crisis) పై.
ఆయన వ్యవహార శైలి తమకు నచ్చడం లేదని పేర్కొన్నారు. ఆ లేఖలను మంత్రులంతా తమ తమ ట్విట్టర్ ఖాతాల్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం వైరల్ గా మారాయి. ప్రస్తుత ప్రభుత్వం ప్రజలకు దూరంగా ఉంటోంది.
ప్రజలు తమకు ఏదో చేయాలని, సర్కార్ జవాబుదారీగా ఉండాలని ఆశిస్తున్నారు. కానీ అవేవీ ఇక్కడ లేవని అందుకే తాను తప్పుకుంటున్నట్లు సునక్ ఆరోపించారు.
కాగా ఇలాంటి ప్రధానమంత్రి నాయకత్వంలో పని చేయడం తనకు నచ్చడం లేదని పేర్కొన్నారు సాజిద్. బోరిస్ జాన్సన్ నేతృత్వంలో పరిస్థితులు మెరుగు పడే అవకాశాలు లేవన్నారు.
Also Read : హింసోన్మాదం దేశానికి ప్రమాదం – కమలా హారీస్