Gareth Wynn Owen : తిరుమలలో యుకె డిప్యూటీ కమిషనర్
స్వామి వారి దర్శనం దివ్య అనుభవం
Gareth Wynn Owen : ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందిన దేవ దేవుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు శ్రీనివాసుడు. తిరుమల పుణ్య క్షేత్రం కోట్లాది మంది భక్తులకు స్వర్గధామంగా విరాజిల్లుతోంది. ప్రతి రోజూ 70 వేల మందికి పైగా స్వామి వారిని దర్శించుకుంటారు. ఒక్కసారి స్వామిని మననం చేసుకున్నా లేదా జపించినా లేదా నామ స్మరణ చేసినా పుణ్యం దక్కుతుందని భక్తుల నమ్మకం, అంతకు మించిన విశ్వాసం కూడా.
Gareth Wynn Owen In TTD
భారత దేశానికి చెందిన భక్తులే కాదు విదేశాలకు చెందిన వారు సైతం తిరుమలను దర్శించు కోవడం ఆనవాయితీగా వస్తోంది. ఆధ్యాత్మిక క్షేత్రాలలో తిరుమల కూడా ఒకటిగా గుర్తింపు పొందింది. అందుకే భారత్ ను దర్శించుకునే వివిధ దేశాలకు చెందిన నాయకులు, అధినేతలు, ప్రధానులు, ఇతర ఉన్నత పదవుల్లో ఉన్న వారు శ్రీవారి సేవలో తరించడం మామూలే.
సాక్షాత్తు అలాంటి అనుభూతిని, దివ్యమైన అనుభవాన్ని తాను పొందానని పొంగి పోయారు యునైటెడ్ కింగ్ డమ్ కు చెందిన ఏపీ, తెలంగాణ డిప్యూటీ కమిషనర్ గారెత్ వైయాన్ ఓవెన్(Gareth Wynn Owen). శనివారం ఆ దేవ దేవుడు శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. ఆలయాలలో ఇది మొదటి దర్శనమని పేర్కొన్నారు. తాను జీవితంలో తొలిసారిగా పంచె, కండువా ధరించానని ఇది చెప్పలేనంతటి ఆనందాన్ని కలిగించిందని తెలిపారు.
Also Read : Kabali 7 Years : తలైవా రజనీకాంత్ కబాలీకి 7 ఏళ్లు