Boris Johnson : బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్ కు చేరుకున్నారు. ఆయన లండన్ నుంచి నేరుగా గుజరాత్ కు చేరుకున్నారు.
అహ్మదాబాద్ విమానాశ్రయంలో పీఎం జాన్సన్ కు సాదర స్వాగతం పలికారు. జాన్సన్ ( Boris Johnson)టూర్ సందర్భంగా భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు.
అనంతరం అక్కడి నుంచి బోరిస్ జాన్సన్ నేరుగా అహ్మదాబాద్ లో ఉన్న మహాత్మా గాంధీ నివసించిన సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా చరాఖాపై నూలు తీశారు. గుజరాత్ సీఎం భూపేష్ పటేల్ ఆయన వెంట ఉన్నారు. అనంతరం ఆశ్రమంలో ఏమేం జరుగుతున్నాయో వివరించారు పీఎంకు. ఆశ్రమ నిర్వహణ, ఏర్పాట్లు అత్యంత ఆహ్లాదకరంగా, ఆలోచింప చేసేలా, అద్భుతమైన వాతావరణంతో ఉందని ప్రశసించారు బోరిస్ జాన్సన్.
ఆశ్రమంతా కలియ తిరిగిన పీఎం అక్కడి ప్రశాంతతను చూసి విస్తు పోయారు. ఇదే కదా భారతీయం అంటే అని పేర్కొన్నారు. సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించిన సమయంలో బోరిస్ జాన్సన్ సందర్శకుల పుస్తకంలో మహాత్ముడు మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ గురించి ఇలా రాశారు.
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారతీయ సంప్రదాయం ప్రత్యేకంగా ఉంది. దీనిని నేను ముందు నుంచీ అర్థం చేసుకుంటూ వచ్చా. భారతదేశం ఎప్పటికీ మహాత్ముడికి రుణపడి ఉంటంది.
ఆయన ఆచరించిన జీవితం ఆదర్శ ప్రాయం. గాంధీ అందించిన శాంతి మంత్రం ఈ ప్రపంచానికి ఓ దిక్సూచి లాంటిదని పేర్కొన్నారు పీఎం బోరిస్.
Also Read : భారత్ తో మైత్రీ బంధానికే ప్రయారిటీ – జాన్సన్