UK PM Race : సెప్టెంబ‌ర్ 5న బ్రిట‌న్ ప్ర‌ధాని ఎంపిక

పీఎం రేసులో రుషి సున‌క్ ..లిజ్ ట్ర‌స్

UK PM Race : అనేక ఆరోప‌ణ‌లతో తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొన్న బ్రిట‌న్ ప్ర‌ధాన మంత్రి బోరిస్ జాన్స‌న్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేయ‌డంతో ఖాళీ ఏర్ప‌డిన ప్ర‌ధాని పోస్టులో ఎవ‌రు ఉంటార‌నే దానిపై క్లారిటీ వ‌చ్చింది.

క‌న్జ‌ర్వేటివ్ పార్టీకి చెందిన వారిలో ప్ర‌ధాన మంత్రి అభ్య‌ర్థిగా ఎవ‌రు ఉండాల‌నే దానిపై ఓటింగ్ జ‌రుగుతుందా లేక స‌మావేశం ఏర్పాటు చేసి క్యాండిడేట్ ను ప్ర‌క‌టిస్తారా అన్న‌ది పార్టీ తేల్చాల్సి ఉంది.

ఇప్ప‌టి వ‌ర‌కు అయితే ఇద్ద‌రి మ‌ధ్యే అత్య‌ధిక పోటీ నెల‌కొంది. బ‌రిలో 11 మందికి పైగా ఉన్న‌ప్ప‌టికీ పోటీ మాత్రం ప్ర‌వాస భార‌తీయుడైన రుషి సున‌క్ , మ‌రో సీనియ‌ర్ నాయ‌కురాలు, విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్న 49 ఏళ్ల లిజ్ ట్ర‌స్ మ‌ధ్యే నెల‌కొంది.

రుషి సున‌క్ భార‌త ఐటీ దిగ్గ‌జ కంపెనీ ఇన్ఫోసిస్ చైర్మ‌న్ నారాయ‌ణ మూర్తి, సుధా నారాయ‌ణ మూర్తి కి అల్లుడు. వారి కూతురినే పెళ్లి చేసుకున్నారు. ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు.

బ్రిట‌న్ లో అత్య‌ధిక సంప‌న్నుల జాబితాలో రుషి సున‌క్, అక్ష‌తా మూర్తి ఉన్నారు(UK PM Race). ఇక బోరీస్ జాన్స‌న్ పీఎం నుంచి దిగి పోయినా త‌న వార‌సుడు ఎవ‌రిని ఎంపిక చేయాల‌నే దానిపై మ‌ల్ల గుల్లాలు ప‌డుతున్నారు.

ఈ మేర‌కు సెప్టెంబ‌ర్ 5న పార్టీకి సంబంధించి ఎవ‌రనే దానిపై పార్టీ డిక్లేర్ చేయ‌నుంది. దీంతో ఎవ‌రు త‌దుప‌రి ప్ర‌ధాన మంత్రి అవుతార‌నే ఉత్కంఠ స‌ర్వ‌త్రా నెల‌కొంది.

రాజ‌కీయ వ‌ర్గాల అంచ‌నా ప్ర‌కారం రిషి సున‌క్ కు ఎక్కువ‌గా చాన్స్ ఉన్న‌ట్లు జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

Also Read : బ్రిట‌న్ ప్ర‌ధాని రేసులో లిజ్ ట్ర‌స్

Leave A Reply

Your Email Id will not be published!