Zelensky UK Tour : ఉక్రెయిన్ చీఫ్ యూకే టూర్
త్వరలోనే రిషి సునక్ తో భేటీ
Zelensky UK Tour : రష్యాతో యుద్దం కొనసాగుతూనే ఉంది. కానీ ఉక్రెయిన్ ఎక్కడా తగ్గడం లేదు. ఇప్పటికే మిస్సైళ్లు, బాంబులతో మోత మోగిస్తోంది రష్యా. మరో వైపు అమెరికా, యుకె, యూరోపియన్ దేశాలు పెద్ద ఎత్తున ఆర్థిక, ఆయుధ సాయం చేస్తున్నాయి ఉక్రెయిన్ చీఫ్ జెలెన్ స్కీకి. దీంతో మనోడు ఎక్కడా తగ్గడం లేదు.
యూకేలో చోటు చేసుకున్న పరిణామాలతో కొత్తగా పీఎంగా కొలువు తీరిన ప్రవాస భారతీయుడైన రిషి సునక్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉక్రెయిన్ చీఫ్ జెలెన్ స్కీ తో సంభాషించారు. అనంతరం ఆ వెంటనే ఉక్రెయిన్ కు వెళ్లారు. అక్కడ పరిస్థితిని చూసి చలించారు.
ఈ మేరకు ఉక్రెయిన్ కు ఆర్థిక సాయం ప్రకటించారు. సాధ్యమైనంత మేరకు ఆదుకుంటామని హామీ కూడా ఇచ్చారు. తాజాగా జెలెన్ స్కీ గ్రేట్ బ్రిటన్ లో పర్యటిస్తారని(Zelensky UK Tour) ఆ దేశం అధికారికంగా వెల్లడించింది. ఇదిలా ఉండగా రష్యా – ఉక్రెయిన్ వార్ తర్వాత ఉక్రెయిన్ చీఫ్ యూకేకు రావడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఆయన పర్యటనపై అంతా ఉత్కంఠ చోటు చేసుకుంది.
మరో వైపు జెలెన్ స్కీ ఎక్కడున్నా వెంటాడుతానని ప్రకటించారు ఇప్పటికే రష్యా చీఫ్ వ్లాదిమీర్ పుతిన్. కావాలని రెచ్చ గొడుతున్నాడని ఆరోపించాడు. ఓ వైపు అమెరికా, యూరోపియన్ దేశాల అండ చూసుకుని ఇలాగే వ్యవహరిస్తూ పోతే పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. మరో వైపు కీలక అంశాలపై యూకే, ఉక్రెయిన్ దేశాధినేతల మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉంది.
Also Read : భారత్ ఆఫ్గాన్ ప్రజలను వదులుకోదు – దోవల్