Zelensky Modi : భారత్ తో బంధంపై ఉక్రెయిన్ ఫోకస్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ కాల్
Zelensky Modi : భారత్ తో ఉక్రెయిన్ బలోపేతం చేసేందుకు ప్రయారిటీ ఇస్తున్నట్లు ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ(Zelensky) స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ప్రెసిడెంట్ మాట్లాడారు. కాగా రష్యా కంటిన్యూగా ఉక్రెయిన్ పై దాడులకు పాల్పడుతోంది.
రష్యా దురాక్రమణ నేపథ్యంలో ఉక్రెయిన్ – భారత్ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ప్రాముఖ్యతను నొక్కి చెప్పినట్లు జెలెన్ స్కీ వెల్లడించారు. ఇందుకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. ఈ విషయాన్ని తన అధికారిక ట్విట్టర్ లో పేర్కొన్నారు.
ప్రత్యేకంగా ప్రస్తావించారు మోదీతో (PM Modi) సంభాషణ గురించి. సంభాషణ సందర్భంగా ఉక్రెయిన్ , భారత భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం ప్రాముఖ్యతను దేశాధినేత నొక్కి చెప్పారు.
మన దేశంలోని తాత్కాలికంగా ఆక్రమించబడిన భూభాగాల్లో రష్యా చేత రెఫరిండం గురించి ప్రత్యేకంగా ఫోన్ లో ప్రస్తావించినట్లు తెలిపారు జెలెన్ స్కీ. ఉక్రెయిన్ భూభాగాలను అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు ఉద్దేశించిన దురాక్రమణదారుల నిర్ణయాలన్నీ అసంబద్దమని పేర్కొన్నారు.
ఉక్రెయిన్ ప్రస్తుత రష్యన్ ఫెడరేషన్ అధ్యక్షుడితో ఎటువంటి చర్చలు జరపదని వోలోడిమిర్ జెలెన్ స్కీ నొక్కి చెప్పారు. చర్చల ద్వారా శాంతియుత పరిష్కారానికి భారత దేశం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.
ఇదిలా ఉండగా జెలెన్ స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము పరస్పర చర్చల ద్వారా భేటీ కావాలని యుఎన్ జనరల్ అసెంబ్లీలో స్పష్టం చేశానని తెలిపారు. ప్రస్తుతం జెలెన్ స్కీ ఫోన్ కాల్ వైరల్ గా మారింది సోషల్ మీడియాలో.
Also Read : పోషియాన్ లో నలుగురు ఉగ్రవాదులు ఖతం