Uma Bharti : ఉమా భార‌తి షాకింగ్ కామెంట్స్

అయినా ప‌ట్టించుకోని బీజేపీ

Uma Bharti : ఆమె మాజీ ముఖ్య‌మంత్రి. ఒక ర‌కంగా చెప్పాలంటే భార‌తీయ జ‌న‌తా పార్టీలో ఫైర్ బ్రాండ్. కానీ వివాదాస్ప‌ద కామెంట్స్ తో ర‌చ్చ ర‌చ్చ చేస్తున్నారు . పార్టీకి ఇబ్బంది క‌లిగించేలా చేస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఎంపీ ప్ర‌గ్యా సింగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్య‌లకు ఉమా భారతి(Uma Bharti) మ‌ద్ద‌తు ప‌లికారు.

ఆత్మ రక్ష‌ణ కోసం ప్ర‌తి ఒక్క హిందూ కుటుంబం ఆయుధాలు క‌లిగి ఉండాల‌ని పేర్కొన్నారు. దీనిపై పెద్ద ఎత్తున రాద్దాంతం చోటు చేసుకుంది. ఇదే స‌మ‌యంలో వివాదాస్ప‌ద కామెంట్స్ చేసి ఇబ్బంది పెడుతున్న ఎంపీకి మ‌ద్ద‌తు ఇవ్వ‌డంపై పార్టీ ప‌ట్టించు కోవ‌డం లేద‌ని స‌మాచారం.

ఇప్ప‌టికే పార్టీకి పెద్ద ఎత్తున డ్యామేజ్ జ‌రుగుతోంది. నూపుర్ శ‌ర్మ ప్ర‌వ‌క్త‌పై చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపాయి. ప్ర‌పంచంలోని ప‌లు దేశాల‌లో అభ్యంత‌రం వ్య‌క్తమైంది. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ఆమెను అరెస్ట్ చేయ‌లేక పోయారు. తాజాగా మ‌రో వివాదాం చోటు చేసుకుంది. అది ల‌వ్ జిహాద్ అంశం కొత్త‌గా తెర పైకి వ‌చ్చింది.

ఇదే క్ర‌మంలో ఉమా భారతి మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తూ వ‌స్తున్నారు. ఇదే స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు క‌మ‌ల్ నాథ్ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు. హిందూ మ‌తం, దేవుళ్లు బీజేపీ కాపీ రైట్ కాద‌ని పేర్కొన్నారు. దీనికి స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు ఉమా భార‌తి(Uma Bharti).

మ‌ధ్య ప్ర‌దేశ్ లో కొలువు తీరిన బీజేపీ స‌ర్కార్ ను కూడా టార్గెట్ చేశారు ఉమా భార‌తి. మ‌ద్య పానాన్ని నిషేధించాల‌ని కోరుతున్నారు.

Also Read : ప్ర‌చారం కోసం ప్ర‌జ‌ల్ని చంపుతారా

Leave A Reply

Your Email Id will not be published!