#UmamaheswaraUgraRoppasya : వెచ్చని జ్ఞాపకం వెంటాడే చిత్రం
సినిమా అనేది అంతులేని కథ. కన్నీటి వ్యధ. ఇక్కడ సక్సెస్ పలకరిస్తుంది..నిట్ట నిలువునా ముంచేస్తుంది. ఒక్క రోజులోనే స్టార్ డం తీసుకు వస్తుంది. జయాపజయాలు సర్వ సాధారణం. కోట్లాది మంది ఈ రంగుల ప్రపంచాన్ని నమ్ముకున్నారు.
రంగులకు వన్నెలద్ది ..కలలకు రెక్కలు తొడిగి..గుండెల్లో ప్రేమ జల్లులను కురిపించి..భావోద్వేగాలను తెర మీద ప్రతిఫలించే ఒకే ఒక్క ప్లాట్ ఫాం ఏదైనా ఉందంటే అది ఒక్కటే ఈ లోకంలో సినిమా. లోకపు కాన్వాస్ ను ఉన్నది ఉన్నట్టు చూపించాలన్నా ఇంతకు మించిన మార్గం మరోటి లేదు. సినిమా అనేది అంతులేని కథ. కన్నీటి వ్యధ. ఇక్కడ సక్సెస్ పలకరిస్తుంది..నిట్ట నిలువునా ముంచేస్తుంది. ఒక్క రోజులోనే స్టార్ డం తీసుకు వస్తుంది. జయాపజయాలు సర్వ సాధారణం. కోట్లాది మంది ఈ రంగుల ప్రపంచాన్ని నమ్ముకున్నారు. ఇంకా ఇక్కడ కలల్ని పోగేసుకుంటూ సంచారం చేస్తున్నారు. అలుపంటూ లేకుండా ..నిద్రకు దూరమై..తమ వారికి చివరకు తనకు తానే కోల్పోయి..ఏదో ఒక సమయంలో తనకంటూ ఓ రోజుంటూ వస్తుందనే ఆశతో సాగి పోవడమే. అభిమానాలు..ఛీత్కారాలు..పలకరింపులు..ప్లాస్టిక్ నవ్వులు..లోలోప దుఖఃం ఉబికి వస్తున్నా పైకి పెదాల మీద వాడిపోని చిరునవ్వులు..షరా మూమూలే. అందుకే ఫిలిం అంటే ఆర్టిస్టులకు..క్రియేటివిటీ కలిగిన వాళ్లకు చచ్చేంత ఇష్టం..అంతకంటే ఎక్కువగా పంచ ప్రాణం కూడా. వాళ్లు మన మధ్యనే ఉంటారు..మనతో పాటే ప్రయాణం చేస్తారు. మనం ఏం కావాలని కోరుకుంటామో..ఎలా ఉండాలని అనుకుంటామో..వాటన్నింటికి తెర మీద ప్రాణం పోస్తారు..దానికి గాత్రం తోడవుతుంది..దృశ్యం వేదికగా నిలుస్తుంది..పాత్రలు కదలాడుతాయి..మనల్ని వెంటాడుతాయి..వేధిస్తాయి..గాయపరుస్తాయి.. గుండెల్ని పిండేస్తాయి. ప్రాణం పోతుందేమోనన్న రీతిలో పలకరిస్తాయి..పలవరించేలా చేస్తాయి.
అందుకే ప్రపంచమంతటా దానికున్నంత డిమాండ్..ఇంకే రంగానికి లేదు..టెక్నాలజీ మారింది..ప్రపంచం కొత్త పోకడలు పోతోంది..కానీ 24 క్రాఫ్ట్ కలగలిసిన ఫిలిం మాత్రం తన దారిని కొత్త పుంతలతో నింపుతోంది. వేల ఆలోచనలు పురుడు పోసుకుంటాయి..వేన వేల హృదయాలు మమేకమై పోతాయి. నిశి రాతిరిలో ..నియాన్ లైట్ల వెలుతురులో తచ్చట్లాడతాయి.. పాటలు..స్టెప్పులు..ద్వందర్థాలు..పాడై పోయిన డైలాగులతో విసిగి వేసారిన జనానికి సామాజిక మాధ్యమాలు ప్రతిభావంతులకు లెక్కలేనన్ని అవకాశాలు కల్పించాయి. రచయితలు..కళాకారులు..ఆర్టిస్టులు..చిత్రకారులు..కెమెరామెన్లు..సంగీత దర్శకులు..కొరియో గ్రాఫర్లు..పాత్రదారుల సంగమమే సినిమా. అందుకే దానికంత క్రేజు..ఎడ తెగని మోజు..టాలెంట్ కు కొదవ లేదు. కానీ బలమైన కంటెంట్ ఉంటేనే ప్రేక్షకులు ఓకే అంటున్నారు..లేదంటే అవతల ఎంత స్టార్లు అయినా సరే నో చెప్పేస్తున్నారు. దీంతో ఎన్నడూ లేనంతగా కంటెంట్ రాజ్యమేలుతోంది. నీవు ఎవరో అవసరం లేదు..నీ దగ్గర దమ్ముందా..జనాన్ని మెస్మరైజ్ చేసే సత్తా నీకుంటే చాలు. వందల మాటలు అక్కర్లేదు..గుండెను చీల్చే..తూటాల్లాంటి మాటలు కావాలి. ఇంకేం కోట్లు నీ చెంతన చేరుతాయి. నీకు ఈ రంగం ఎర్ర తివాచీ పరుస్తుంది. ఇపుడు ఇండియన్ సినిమా తన గతిని మార్చుకుంటోంది.
సమాజాన్ని ప్రభావితం చేసి..మెస్సేజ్ ఇచ్చే కంటెంట్ కు ఎక్కువగా ప్రయారిటీ పెరుగుతోంది. ఇదే సమయంలో తెలుగు సినిమా దేశపు ఎల్లలను దాటి..హాలీవుడ్ ను సైతం ఆశ్చర్య పోయేలా చేస్తోంది. సోషల్ మీడియా దెబ్బకు తామే గొప్పవాళ్లమని ఊరేగుతున్న వాళ్లకు కళ్లు చెదిరేలా తమ టాలెంట్ తో నిమిషాల్లోపే యూట్యూబ్ స్టార్లుగా అవతరిస్తున్నారు. ఇక ఫిలిం వరకు వస్తే ఇటీవల థియేటర్ల కంటే ..ఓటీటీ ఫ్లాట్ ఫాంలు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. టాలెంటెడ్ ఆర్టిస్టులకు భారీ అవకాశాలు కల్పిస్తున్నాయి. ఈ ఏడాదిలో లో బడ్జెట్ సినిమాలు ప్రధాన సినిమాలతో పోటీ పడి కాసులు కురిపించాయి. అందులో వెంకటేశ్ మహా తీసిన కంచెర పాలెం ఒకటి. ఈ ఒక్క సినిమాతో మనోడి వైపు తెలుగు పరిశ్రమ చూసింది. కొన్నేళ్లుగా అవే మొహాలతో బోర్ కొట్టిన జనాలు కొత్తదనం కోరుకుంటున్నారు. నేటివిటీని ఇష్ట పడుతున్నారు. ఎలాంటి భేషజాలు లేకుండా అన్ని వర్గాల ప్రజలు ఆదరించేలా మూవీస్ వస్తున్నాయి. వాటికే జనం బ్రహ్మరథం పడుతున్నారు. బడా బాబులు…నిర్మాతలు..కంపెనీలు..అన్నీ కంటెంట్ కు ప్రయారిటీ ఇస్తున్నాయి. ఎంత ఖర్చు పెట్టేందుకైనా సై అంటున్నాయి. అలాంటి వాటిలో ఆహా, అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్..జీ ఫై..హాట్ స్టార్..లాంటివి ముందంజలో ఉన్నాయి. సినీ లోకం కరోనాను దాటుకుని సేద దీరుతోంది..నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఇదిలా ఉంటే ఇదే దర్శకుడు తీసిన మరో బెస్ట్ మూవీ పీస్ ..ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య. పేరే చిత్రంగా వుంది కదూ. అదే మనోడి టాలెంట్ కు మచ్చుతునక. లోకల్ టాలెంటెడ్ ఆర్టిస్టులకు ప్రాధాన్యత ఇస్తూ ఫిలిం తీశాడు.
ఎక్కడా రాజీ పడలేదు. మనసును సుతిమెత్తగా తాకే మాటలు..ఆలోచింప చేసే పాత్రలు..కన్నీళ్లు తెప్పించే దృశ్యాలు..సందర్భానుసారంగా హత్తుకునే సంగీతం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. లఘు చిత్రం ద్వారా మెప్పించిన రూప నటన ఆకట్టుకుంటుంది. హీరో సత్యదేవ్ తనని తాను మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఇటీవలే ఇది నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. జీవితాంతం వెంటాడేలా డైలాగులు ఇందులో ఉన్నాయి. మళయాళంలో సక్సెస్ అయిన సినిమాకు ఇది మాతృక. ఎక్కడా దాని ఛాయలు కనిపించవు. సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన విజయ ప్రవీణ ఇందులో వేశ్య పాత్రలో జీవించింది. కన్నీళ్లను తెప్పించింది. అరకు అందాలన్నీ ఇక్కడ మనకు కనువిందు చేస్తాయి. స్టూడియో నడిపే సత్యదేవ్ పక్కింటి కుర్రాడిగా మెప్పించాడు.
తండ్రిగా మళయాళ నటుడు రాఘవన్ నటన అమోఘం. కొన్ని మాటలే అయినా అవి గుచ్చుకుంటాయి. కళ అనేది పాఠాలు వింటే రాదు..పరితపిస్తే వస్తుంది.. నీకు టెక్నిక్ వుంది..ఎమోషన్ లేదు..నొప్పి రుచి తెలియని వాడే ..చేయి చేసుకుంటాడు. తెలిసిన వాడు చెయ్యి ఎత్తడానికి కూడా ఆలోచిస్తాడు. వెళ్లి పోవాలని అనుకున్న వాళ్లను వెళ్లనివ్వక పోతే..ఉన్నా వెళితిగానే ఉంటుంది. సుహాన్ , నరేష్ కామెడీ పండింది..హరిచందన, జ్యోతిల నేచురల్ నటన అభినందించకుండా ఉండలేం. బిజుబుల్ పాటలు..అప్పు ప్రభాకర్ కెమెరా పనితనం ఈ మూవీకి అదనపు హంగులు అద్దాయి. ఈ సినిమాను చూడక పోవడం అంటే..మన లైఫ్ ను కోల్పోయినట్లే.
No comment allowed please