Umamaheswara Kalyanam : కమనీయం ఉమామహేశ్వర కళ్యాణం
శ్రీశ్రీశ్రీ శ్రీకృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ
Umamaheswara Kalyanam : శ్రీకృష్ణ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ(Sri Sri Sri Krishnajyoti Swaroopananda Swamiji) ఆధ్వర్యంలో 80వ విశ్వ శాంతి మహాయాగ మహోత్సవం కొనసాగుతోంది. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో భారీ ఎత్తున ఏర్పాటు చేసిన ఈ యాగానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. స్వామి వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమామహేశ్వర కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. స్వామి వారి ఆశీస్సులు అందుకున్నారు. యాగం నిర్వహించడం వల్ల మానసిక, శారీరక ఆరోగ్యం బాగు పడుతుందని స్వామి తెలిపారు. ఇదిలా ఉండగా ఆగస్టు 27 వరకు అతిరుద్ర మహా యాగం కొనసాగుతుంది.
Umamaheswara Kalyanam Viral
యాగంలో భాగంగా ప్రతి రోజూ ఉదయం 7 గంటలకు గోపూజ, 7.30 గంటలకు తులసి పూజ, 9 గంటలకు సహస్ర లింగార్చన, రుద్రాభిషేకం, 10 గంటలకు కోటి కుంకుమార్చన, మధ్యాహ్నం 12 గంటలకు విష్ణు సహస్ర నామం, లలిత సహస్ర నామం, సౌందర్య లహరి పారాయణం, 2 గంటలకు హనుమాన్ చాలీసా పారాయణం, భజనలు , రాత్రి 7 గంటలకు రుద్రక్రమార్చన, లక్ష బిల్వార్చన, 8.30 గంటలకు తీర్థ ప్రసాదం అందజేస్తున్నారు నిర్వాహకులు.
కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉదయం 7 గంటలకు విశేష చండీ సహిత గజలక్ష్మీ హోమాలు , సామూహిక విశేష లక్ష్మీ కుంకుమార్చన, లక్ష గాజులార్చనలు చేపట్టారు. ఇక 19న శనివారం ఉదయం 7 గంటలకు శ్రీ లక్ష్మీ నరసింహ సహిత సుదర్శన, లక్ష్మీనారాయణ నవగ్రహ, సంతాన లక్ష్మీ హోమాలు ఉంటాయి. సాయంత్రం 6 గంటలకు వేంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం, లక్ష బిల్వార్చన, రుద్రాక్ష మార్చన జరగనుంది.
Also Read : Allu Arjun Election Campaign : మామ కోసం బన్నీ ప్రచారం