UN Chief : బుద్దుడి జీవితం ఆదర్శ ప్రాయం
యుఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో
UN Chief : బుద్ద పూర్ణిమ సందర్భంగా ఐక్య రాజ్యసమితి ప్రధాన కార్యదర్శి(UN Chief) ఆంటోనియో గుటెర్రెస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ మానవాళికి దక్కిన అరుదైన మానవుడు బుద్దుడని ప్రశంసించారు.
ఆయన అనుసరించిన జీవితం, బోధనలు ఈ లోకానికి మార్గదర్శకాలు అని పేర్కొన్నారు. బుద్ద పూర్ణిమను గౌతమ బుద్దుని పుట్టిన రోజుగా నిర్వహిస్తారు. నేపాల్ లోని లుంబిని సోమవారం భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సందర్శించారు.
ఈ సందర్భంగా జరిగిన సదస్సులో ప్రసంగించారు. ఇదిలా ఉండగా ఆంటోనియో గుటెర్రెస్(UN Chief) బుద్దుడి జీవితం అనుసరణీయమని సూచించారు.
శాంతి, ధర్మం, నీతి, నియమం అన్నవి ప్రతి ఒక్కరికి అవసరమని, సర్వ సమానత్వమే ఈ ప్రపంచానికి కావాల్సిందని బోధించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు యుఎన్ జనరల్ సెక్రటరీ. ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు.
ట్వీట్ చేస్తూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బౌద్దులకు శుభాకాంక్షలు తెలియ చేశారు. బుద్ద భగవానుడి జననం , జ్ఞానోదయం ఓ కాంతి రేఖ. ఆరోగ్య కరమైన ఈ భూమి మీద అందరికీ శాంతి, గౌరవ ప్రదమైన జీవితాలను నిర్మించాలని సంకల్పిద్దామని ఆంటోనియో గుటెర్రెస్ పిలుపునిచ్చారు.
ఐక్య రాజ్య సమితి(UN Chief) ప్రధాన కార్యదర్శితో పాటు టిబెటన్ ఆధ్యాత్మిక నాయకుడు దలైలామా నిజమైన మనశ్నాంతి కోసం గౌతమ బుద్దుని మాటలపై ఎక్కువ శ్రద్ధ వహించాలని కోరారు.
నేను అన్ని మత సంప్రదాయాలను గౌరవిస్తాను. అవన్నీ చాలా విలువైనవి. అవన్నీ కరుణను బోధిస్తాయని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా బుద్ద పూర్ణిమను యావత్ లోకమంతా జరుపుకుంటోంది.
Also Read : బుద్దం శరణం గశ్చామి – నరేంద్ర మోదీ