Manish Sisodia : ఒత్తిడి త‌ట్టుకోలేక సీబీఐ ఆఫీస‌ర్ సూసైడ్

డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియా ఆరోప‌ణ‌

Manish Sisodia :  త‌న‌ను ఇరికించమ‌ని ఒత్తిడి చేయ‌డంతో సీబీఐ అధికారి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియా.

సీబీఐకి చందిన డిప్యూటీ లీగ‌ల్ అడ్వైజ‌ర్ జితేంద్ర కుమార్ గ‌త వారం ద‌క్షిణ ఢిల్లీలోని త‌న నివాసంలో సూసైడ్ కు పాల్ప‌డ్డాడు. ఈ విష‌యాన్ని అధికారికంగా వెల్ల‌డించారు పోలీసులు.

త‌న‌ను ఇరికించాలంటూ ఒత్తిడికి పాల్ప‌డ్డారు. ఎక్క‌డా ఆధారాలు వారికి ల‌భించ‌లేదు. ఏ ఆధారం చూపించి త‌న‌పై కేసు న‌మోదు చేస్తారో చెప్పాల‌న్నారు.

దీంతో అటు పైకి స‌మాధానం చెప్ప‌లేక త‌నంత‌కు తానుగా సూసైడ్ చేసుకున్నాడంటూ పేర్కొన్నారు మ‌నీష్ సిసోడియా(Manish Sisodia) . సోమ‌వారం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.

అధికారుల‌పై ఇంతలా ఎందుకు ఒత్తిళ్ల‌కు గురి చేస్తున్నారంటూ నిల‌దీశారు మ‌నీష్ సిసోడియా. ప్ర‌ధాన మంత్రి నిర్వాకం కార‌ణంగా చాలా మంది ప‌నిచేయ‌కుండా పోవ‌డం లేద‌ని మండిప‌డ్డారు.

న‌న్ను ఇరికించాల‌న్న‌ది వారి ప్ర‌య‌త్నం. కానీ మాన‌సిక ఒత్తిడిని భ‌రించ లేక పోయాడు. చివ‌ర‌కు ఆత్మ‌హ‌త్యే బెట‌ర్ అని భావించాడ‌ని పేర్కొన్నారు.

డిప్యూటీ సీఎం ఇవాళ మీడియాతో మాట్లాడారు. గురువారం ఉద‌యం డిఫెన్స్ కాల‌నీ పోలీస్ స్టేష‌న్ కు ఒక వ్య‌క్తి ఉరి వేసుకుని ఉన్న‌ట్లు త‌మ‌కు కాల్ వ‌చ్చింద‌ని, ఫోరెన్సిక్ మొబైల్ బృందంతో పాటు క్రైమ్ టీం అక్క‌డికి చేరుకుంద‌న్నారు.

గ‌త ఏడాది నవంబ‌ర్ లో తీసుకు వ‌చ్చిన ఢిల్లీ ఎక్సైజ్ పాల‌సీని రూపొందించి అమ‌లు చేయ‌డంలో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ‌న్న ఆరోప‌ణ‌ల‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు.

Also Read : బీజేపీతో పొత్తు ఓ మూర్ఖ‌త్వం – నితీశ్ కుమార్

Leave A Reply

Your Email Id will not be published!