Munugodu Result : మునుగోడు రిజ‌ల్ట్ పై ఎడ‌తెగ‌ని ఉత్కంఠ

ఓట్ల లెక్కింపు ప్రారంభించిన ఈసీ

Munugodu Result : దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపిన మునుగోడు ఉప ఎన్నిక ఇవాల్టితో తేల‌నుంది(Munugodu Result) . ఇప్ప‌టికే కౌంటింగ్ ప్రారంభ‌మైంది. ఇక ఎవ‌రు గెలుస్తార‌నే దానిపై టెన్ష‌న్ నెల‌కొంది. కోట్లాది రూపాయ‌లు బెట్టింగ్ కూడా జ‌రిగిన‌ట్లు స‌మాచారం. లెక్క‌లేనంత మద్యం, లెక్క‌ల్లోకి రాని కోట్లు, బ‌హుమ‌తులు, ప్ర‌లోభాలు భారీ ఎత్తున చోటు చేసుకున్నాయి.

ఈ ఉప ఎన్నికలో ప్ర‌ధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ పోటీలో ఉన్నా ప్ర‌ధాన పోటీ మాత్రం టీఆర్ఎస్, బీజేపీ అభ్య‌ర్థుల మ‌ధ్యే జ‌రిగింది. మొత్తం 2,41,805 ఓట్ల‌కు గాను 2,25,192కు పైగా ఓట్లు పోల్ కావ‌డం విశేషం. గులాబీ, కాషాయ శ్రేణులు మాత్రం ఎవ‌రికి వారు గెలుస్తామ‌ని ధీమా వ్య‌క్తం చేశారు.

93.41 పోలింగ్ శాతం న‌మోదై చ‌రిత్ర సృష్టించింది. ఇప్ప‌టికే అభ్య‌ర్థులు కౌంటింగ్ వ‌ద్ద‌కు చేరుకున్నారు. ఉద‌యం 7.30 గంట‌ల‌కు అభ్య‌ర్థులు, ఏజెంట్ల స‌మ‌క్షంలో తెరిచారు. ముందుగా పోస్ట‌ల్ బ్యాలెట్ ల‌ను లెక్కిస్తారు. ఎనిమిది గంట‌ల‌కు ఈవీఎంలు లెక్కించ‌డం ప్రారంభించారు. మొత్తం 21 టేబుళ్ల‌ను ఏర్పాటు చేశారు.

ఒక్కో టేబుల్ మీద 15 రౌండ్ల పాటు లెక్కిస్తారు. మ‌ధ్యాహ్నం వ‌ర‌కు మొత్తం రిజ‌ల్ట్ ప్ర‌క‌టించే(Munugodu Result)  అవ‌కాశం ఉంది. 119 కేంద్రాల‌లో 298 పోలింగ్ కేంద్రాల‌ను ఏర్పాటు చేశారు. 3 వేల మంది పోలీసులు 20 కేంద్ర బ‌ల‌గాల‌ను మోహ‌రించారు.

చివ‌ర‌లో మూడు చోట్ల ఈవీఎంలు మొరాయించారు. తాజాగా ఓట్ల లెక్కింపు కోసం 250 మంది సిబ్బందిని నియ‌మించారు. కౌంటింగ్ కేంద్రం వ‌ద్ద 144 సెక్ష‌న్ విధించారు.

మొత్తంగా యూత్ ఎవ‌రి వైపు ఓటు వేశార‌నేది ఉత్కంఠ‌గా మారింది.

Also Read : మునుగోడు ఎన్నిక‌ల కౌంటింగ్ ఆపాలి – ముర‌ళి

Leave A Reply

Your Email Id will not be published!