Undavalli Arun Kumar : బాబుకు జైలు శిక్ష తప్పదు
ఉండవల్లి అరుణ్ కుమార్ కామెంట్స్
Undavalli Arun Kumar : విజయవాడ – కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్(Undavalli Arun Kumar) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కీం స్కామ్ లో అడ్డంగా దొరికి పోయాడని అన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే ఎలా రూ. 371 కోట్లు మాయం చేశారో తలుచుకుంటేనే భయంగా ఉందన్నారు.
Undavalli Arun Kumar Comments Viral
ఈ విషయంలో ఏపీ సర్కార్ ను తాను అభినందిస్తున్నట్లు చెప్పారు. తాను జగన్ రెడ్డిని ఇప్పటి వరకు కలవలేదన్నారు. కానీ ఆయన కేబినెట్ లో ఉన్న చాలా మంది మంత్రులలో తనకు తెలిసిన వారున్నారని చెప్పారు. వాళ్లు ప్రతి రోజూ తనకు ఫోన్ చేస్తుంటారని, క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకుంటారని అన్నారు.
వ్యవస్థలను మేనేజ్ చేస్తూ ఇంత కాలం నెట్టుకుంటూ వచ్చిన చంద్రబాబు నాయుడుకు విచిత్రంగా జగన్ రెడ్డికి చిక్కాడని పేర్కొన్నారు. తనకు తెలిసినంత వరకు మాజీ సీఎంకు కనీసం 10 ఏళ్ల జైలు శిక్ష తప్పదన్నారు. 409 సెక్షన్ పరంగా ఏపీ సీఐడీ సమర్పించిన ఆధారాల మేరకు ఏపీ ఏసీబీ కోర్టు జడ్జి సరైన తీర్పు చెప్పారని తాను భావిస్తున్నట్లు తెలిపారు.
అయితే తాను జగన్ కు సపోర్ట్ చేయడం లేదన్నారు. ఇక చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత జగన్ రెడ్డిని చూసి రామోజీరావుకు భయం పట్టుకుందన్నారు. తాను న్యాయం కోసం ప్రశ్నించానని స్పష్టం చేశారు ఉండవల్లి అరుణ్ కుమార్.
Also Read : KA Paul : పవన్ కళ్యాణ్ ప్యాకేజీ స్టార్ – పాల్