Undavalli Arun Kumar : రామోజీరావు చేసింది తప్పే
తప్పు ఒప్పుకుంటే మంచిది
Undavalli Arun Kumar : మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన కామెంట్స్ చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈనాడు సంస్థల అధిపతి రామోజీ రావుపై నిప్పులు చెరిగారు. తాను చేసిన ఆరోపణల్లో వాస్తవం ఉందన్నారు. ఆయన చేసింది ముమ్మాటికీ తప్పేనని అన్నారు. కచ్చితంగా కోర్టులో మార్గదర్శికి వ్యతిరేకంగా తీర్పు వస్తుందని చెప్పారు ఉండవల్లి అరుణ్ కుమార్.
ఇదే సమయంలో ఉమ్మడి పౌర స్మృతి (యుసీసీ) గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. యూసీసీ బీజేపీ సిద్ధాంతం కాదన్నారు. రాజ్యాంగ మౌలిక స్వరూపం లోనే ప్రతిపాదన ఉందన్నారు. ఆర్థిక అసమానతలను అప్పట్లో దీనిని ప్రతిపాదించారని చెప్పారు. పేదరికం ఎక్కడ ఎక్కువగా ఉంటుందో అక్కడ జన సంఖ్య ఎక్కువగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.
అయితే యూసీసీ అవసరం లేదంటూ 21వ లా కమిషన్ మోదీ ప్రభుత్వానికి సూచించిందని స్పష్టం చేశారు ఉండవల్లి అరుణ్ కుమార్(Undavalli Arun Kumar). జూన్ 24న తొందరపడి ముందుకు వెళ్లవద్దంటూ పేర్కొందన్నారు. భిన్న మతాలు, భిన్న సంస్కృతులు , విభిన్న సంప్రదాయాలు ఉన్న ఈ దేశంలో యూసీసీ అమలు లోకి తీసుకు రావడం చాలా కష్టమన్నారు . నెంబర్ గేమ్ కోసమే బీజేపీ యూసీసీ బిల్లు ప్రతిపాదన చేస్తోందన్నారు ఉండవల్లి.
Also Read : Ajit Pawar : బీజేపీతో కలిసేందుకు పవార్ ప్రయత్నం