Binoy Viswam : హిందీకి అనవసరమైన ప్రాధాన్యత – ఎంపీ
ప్రధానమంత్రికి ఎంపీ బినోయ్ విశ్వం లేఖ ప్రధానమంత్రికి ఎంపీ బినోయ్ విశ్వం లేఖ
Binoy Viswam : కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలోని పార్లమెంటరీ ప్యానల్ హిందీని అమలు చేయాలని కోరుతూ రాష్ట్రపతికి నివేదిక ఇవ్వడం దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం చెలరేగుతోంది. ఇప్పటికే తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, ఎండీఎంకే అగ్ర నాయకుడు వైగో, అళగిరితో పాటు కేరళ సీఎం పినరయి విజయన్ తీవ్రంగా ఖండించారు. లేఖలు రాశారు. హిందీని బలవంతంగా రుద్దాలని ప్రయత్నం చేస్తే యుద్దం తప్పదని హెచ్చరించారు.
ఈ తరుణంలో పలువురు లేఖలు సంధిస్తున్నారు. నేరుగా ప్రధానమంత్రికి రాస్తున్నారు. తాజాగా ఎంపీ బినోయ్ విశ్వం(Binoy Viswam) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసలు హిందీ భాషకు అనవసరమైన ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. ఆ భాషకు అంత సీన్ లేదన్నారు.
ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాలలో ఎవరికి వారు తమ భాషలోనే మాట్లాడుకుంటారని కొత్తగా హిందీని తప్పనిసరి చేయాలని అనుకోవడం మంచి పద్దతి కాదన్నారు. ఐఐటీ లేదా ఐఐఎం వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో పెద్ద సంఖ్యలో హిందీ మాట్లాడే వారి సంఖ్య పెరుగతుందన్నారు.
ఇది ఒక రకంగా కక్ష సాధింపు తప్ప మరొకటి కాదని పేర్కొన్నారు. ఈ నివేదికను వెంటనే వెనక్కి తీసుకోవాలని బినోయ్ విశ్వం డిమాండ్ చేశారు ప్రధానమంత్రిని. సీపీఐ కేరళకు చెందిన విశ్వం ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. మోదీకి రాసిన లేఖలో భారత దేశ ఆధిపత్య భాషగా మార్చేందుకు హిందీకి అనవసరమైన ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు.
నా అభ్యంతరాన్ని తీవ్రంగా వ్యక్తం చేస్తానని తెలిపారు విశ్వం. రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ లో గుర్తించబడిన 21 ఇతర అధికార భాషల ప్రాముఖ్యతను తగ్గిస్తుందని పేర్కొన్నారు.
Also Read : హిందీ ప్యానల్ నివేదికపై కేరళ సీఎం ఫైర్