TS JOBS : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగాల భర్తీకి(TS JOBS )గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అసెంబ్లీ సాక్షిగా డిక్లేర్ చేశారు. ఈ సందర్బంగా జిల్లాలు, జోన్లు, కేటగిరీల వారీగా వివరాలు వెల్లడించారు.
మొత్తం 80 వేల 39 పోస్టులకు పచ్చ జెండా ఊపారు. సభలో హర్షధ్వానాల మధ్య ప్రకటించారు కేసీఆర్. అనంతరం గులాబీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబురాల్లో మునిగి పోయాయి. పాలాభిషేకం చేశారు.
తాను ప్రకటించిన వెంటనే నోటిఫికేషన్లు జారీ అవుతాయని, కష్టపడి చదువుకుని పరీక్షలకు ప్రిపేర్ కావాలని స్పష్టం చేశారు. దీంతో నిరుద్యోగులు, ఉద్యోగార్థులలో (TS JOBS )సంతోషం వ్యక్తమైంది.
ఇదిలా ఉండగా ప్రకటించి రోజులైనా ఈరోజు వరకు ఒక్క నోటిఫికేషన్ జారీ కాలేదు. దీంతో నిరుద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గతంలో ప్రకటించినా ఈరోజు వరకు భర్తీ చేసిన పాపాన పోలేదన్న ఆరోపణలు ఉన్నాయి.
అదిగో జాబ్స్ అంటూ ఊరిస్తూ వచ్చారు. కానీ అధికారికంగా ఒక్క ప్రకటన జారీ కాలేదు. దీంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఒక్క తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లోనే 25 లక్షల మందికి పైగా నిరుద్యోగులు జాబ్స్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.
ఇంకా 50 లక్షల మంది కొలువుల కోసం నిరీక్షిస్తున్నారు. భర్తీ చేయబోయే ఉద్యోగాలలో ఎక్కువగా పోలీసు శాఖకు చెందినవే ఉండడం కొంత ఆందోళన కలిగిస్తోంది.
కేవలం ఈ ప్రకటన కూడా ఎన్నికల నినాదంగానే మారుతోందా అన్న అనుమానం వ్యక్తం అవుతోంది. వచ్చే నెల 2న జరిగే ఉగాది పండుగ సందర్భంగా కొన్ని నోటిఫికేషన్లు వచ్చే ఛాన్స్ ఉందంటోంది సర్కార్.
తొలి విడత 30 నుంచి 40 వేల పోస్టుల భర్తీకి జాబ్స్ ఇవ్వనున్నట్లు సమాచారం.
Also Read : విద్యార్థుల కోసం ఆంగ్ల పాఠాలు