Union Ministers : పాఠశాలల అప్ గ్రేడ్ కు కేంద్రం ఆమోదం
వెల్లడించిన ధర్మేంద్ర ప్రధాన్..అనురాగ్ ఠాకూర్
Union Ministers : దేశ వ్యాప్తంగా ఉన్న 14,500 పాఠశాలలను అప్ గ్రేడ్ చేసేందుకు పీఎం శ్రీ యోజనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పాఠశాలలు మోడల్ బడులుగా మారతాయి.
జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) 2020 కి సంబంధించి పూర్తి స్పూర్తిని పొందు పరుస్తాయన్నారు. ఈ విషయం గురించి వివరించారు కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, అనురాగ్ ఠాకూర్(Union Ministers) .
ప్రధాన మంత్రి పాఠశాలలు రైజిండ్ ఇండియా యోజనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. మొత్తం బడులను అప్ గ్రేడ్ చేస్తామన్నారు.
కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలతో సహా 14,00 పాఠశాలలు పీఎంశ్రీ పాఠశాలలుగా ఉద్భవించేందుకు బలోపేతం చేయబడతాయని స్పష్టం చేశారు.
ఇక నుంచి ఈ పాఠశాలలన్నీ మోడల్ పాఠశాలలుగా మారతాయన్నారు. సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని మోదీ ఈ విషయం గురించి ప్రకటన చేశారన్నారు.
స్పూర్తిని నింపే మోడల్ స్కూళ్లుగా మారబోతున్నాయని చెప్పారు మంత్రులు. పాఠశాలలు విద్యను అందించేందుకు ఆధునిక, పరివర్తన , సంపూర్ణ పద్దతిని కలిగి ఉంటాయని ప్రధానమంత్రి అన్నారు.
డిస్కవరీ, ఓరియంటెడ్, లెర్నింగ్ సెంట్రిక్ టీచింగ్ మార్గాన్ని నొక్కి చెబుతుందన్నారు. అత్యాధునిక సాంకేతికత, స్మార్ట్ క్లాస్ రూమ్ లు, క్రీడలు సహా ఆధునిక మౌలిక సదుపాయాలపై కూడా దృష్టి సారిస్తామని చెప్పారు ధర్మేంధ్ర ప్రధాన్, అనురాగ్ ఠాకూర్.
జాతీయ విద్యా విధానం ఇటీవలి సంవత్సరాలలో విద్యా రంగాన్ని సమూలంగా మార్చిందన్నారు. భారత దేశంలోని లక్షలాది మంది విద్యార్థులకు పీఎం శ్రీ పాఠశాలలు మరింత ప్రయోజనం చేకూరుస్తాయని చెప్పారు.
Also Read : 80 శాతం బడులు యార్డుల కంటే అధ్వాన్నం