Centre VS Delhi : కేంద్ర పాలిత ప్రాంతాల‌కు ప‌వ‌ర్స్ ఉండ‌వు

సుప్రీంకోర్టుకు స్ప‌ష్టం చేసిన కేంద్ర స‌ర్కార్

Centre VS Delhi : కేంద్రంలో కొలువు తీరిన మోదీ బీజేపీ స‌ర్కార్ కు ఢిల్లీ లోని ఆప్ ప్ర‌భుత్వానికి మ‌ధ్య(Centre VS Delhi) ఆధిప‌త్య పోరు కొన‌సాగుతూ వ‌స్తోంది. త‌మ‌పై కేంద్రం పెత్త‌నం ఏంటి అంటూ ప్ర‌శ్నిస్తోంది ఆప్. ఓ వైపు కేంద్రం మ‌రో వైపు ఢిల్లీ స‌ర్కార్ మ‌ధ్య ఎవ‌రికి అధికారాలు ఉంటాయ‌నే దానిపై కోర్టును ఆశ్ర‌యించాయి.

దీనికి సంబంధించి కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ఈ మేర‌కు కేంద్ర పాలిత ప్రాంతాల‌కు ఎలాంటి ప‌వ‌ర్స్ అంటూ ఉండ‌వ‌ని స్ప‌ష్టం చేసింది కేంద్రం. ఇదే విష‌యాన్ని కోర్టుకు నివేదించింది. దేశంలోని ఏ కేంద్ర ప్రాంత పాలిత ప్రాంతానికి ప్ర‌త్యేక ప‌వ‌ర్స్ అంటూ ఉండ‌వ‌ని స్ప‌ష్టం చేసింది.

ఆర్టిక‌ల్ 239ఏఏకి ఆప్ ప్ర‌భుత్వ వివ‌ర‌ణ‌ను అత్యున్న‌త న్యాయస్థానం అంగీక‌రించేలా చేయాలిని ఢిల్లీ డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియా కోర్టును ఆశ్ర‌యించారు. దీనిపై ఆప్ స‌ర్కార్ కావాల‌ని రాద్దాంతం చేస్తోందంటూ ఆరోపించింది కేంద్రం.సేవ‌ల నియంత్ర‌ణ‌పై కేంద్రం, ఢిల్లీ ప్ర‌భుత్వం న్యాయ ప‌ర‌మైన వివాదంలో చిక్కుకున్నాయి.

రాజ్యాంగం ప్ర‌కారం ఏ కేంద్ర పాలిత ప్రాంతానికి సొంత సేవ‌లు లేవ‌ని మ‌రోసారి స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్రధాన న్యాయ‌స్థానం సుప్రీంకోర్టుకు తెలిపింది. సిసోడియా కావాల‌ని రాద్దాంతం చేస్తున్నారంటూ మండిప‌డింది.

ఇదిలా ఉండ‌గా రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 239ఎఎ 69వ రాజ్యాంగ స‌వ‌ర‌ణ ద్వారా కేంద్ర పాలిత ప్రాంతాల‌లో ఢిల్లీకి ప్ర‌త్యేక హోదాను మంజూరు చేస్తోంది.

కాగా సుప్రీంకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ప్ర‌జ‌ల‌కు సేవ‌లు చేయాల్సిన బాధ్య‌త కేంద్రం, ఢిల్లీకి ఉంది. ఇలా ఆధిప‌త్య పోరు వ‌ల్ల న‌ష్ట పోయేది సామాన్యులేన‌ని పేర్కొంది.

Also Read : ఢిల్లీ బ‌ల్దియాపై ఆప్ దే జెండా

Leave A Reply

Your Email Id will not be published!