UP BIHAR AP TOP : పిల్ల‌ల అక్ర‌మ ర‌వాణాలో యూపీ..బీహార్..ఏపీ

దేశ రాజ‌ధాని ఢిల్లీలో 68 శాతం పెరుగుద‌ల

UP BIHAR AP TOP : ఈ దేశానికి స్వ‌తంత్రం ల‌భించి 75 ఏళ్ల‌వుతున్నా ఇంకా పిల్ల‌ల అక్ర‌మ ర‌వాణా కొన‌సాగుతూనే ఉన్న‌ది. ఎన్ని చ‌ట్టాలు తీసుకు వ‌చ్చినా ఫ‌లితం లేకుండా పోతోంది. తాజాగా వెల్ల‌డైన నివేదిక‌లో దిగ్భ్రాంతిక‌ర‌మైన వాస్త‌వాలు వెలుగు చూశాయి.

పిల్ల‌ల అక్ర‌మ ర‌వాణాకు సంబంధించి చూస్తే దేశంలోనే మూడు రాష్ట్రాలు టాప్ లో కొన‌సాతుండడం విస్తు పోయేలా చేసింది. వాటిలో భారతీయ జ‌న‌తా పార్టీ ఆధ్వ‌ర్యంలోని ఉత్త‌ర ప్ర‌దేశ్ ఉండ‌గా, జేడీయూ నేతృత్వంలోని బీహార్, వైఎస్సార్సీపీ సార‌థ్యంలోని ఆంధ్ర ప్ర‌దేశ్ వ‌రుస‌గా మూడు స్థానాల్లో కొన‌సాగుతున్నాయి.

UP BIHAR AP TOP States

విచిత్రం ఏమిటంటే ఢిల్లీలో పిల్లల అక్ర‌మ ర‌వాణా కేసులు 68 శాతానికి పైగా పెర‌గ‌డం ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. 2016 నుండి 2022 వ‌ర‌కు దేశ రాజ‌ధానిలో అత్య‌ధికంగా పిల్ల‌ల అక్ర‌మ ర‌వాణా చోటు చేసుకుంద‌ని తేలింది. ప్ర‌పంచ వ్య‌క్తుల అక్ర‌మ ర‌వాణా వ్య‌తిరేక దినోత్స‌వం సంద‌ర్భంగా ఓ స్వ‌చ్చంధ సంస్థ వివ‌రాల‌ను వెల్ల‌డించింది. గేమ్స్ 24×7, కైలాష్ స‌త్యార్థి చిల్డ్ర‌న్ పీస్ ఫౌండేష‌న్(Satyarthi Foundation) సంయుక్తంగా క‌లిసి నివేదిక‌ను విడుద‌ల చేశాయి.

ఇక పిల్ల‌ల అక్ర‌మ ర‌వాణాకు సంబంధించి జైపూర్ సిటీ అగ్ర స్థానంలో నిలిచింది. దేశంలోని 21 రాష్ట్రాల‌లోని 262 జిల్లాల్లో పిల్ల‌ల అక్ర‌మ ర‌వాణా కేసులకు సంబంధించి వివ‌రాలు సేక‌రించారు. ఇందులో దిగ్భ్రాంతిక‌ర‌మైన వాస్త‌వాలు వెల్ల‌డ‌య్యాయి.

Also Read : TS Cabinet Meeting : మంత్రివ‌ర్గ స‌మావేశంపై ఉత్కంఠ

Leave A Reply

Your Email Id will not be published!