Yogi Adityanath : ములాయంను పరామర్శించిన ‘యోగి’
ఆరోగ్యం ఎలా ఉందంటూ వాకబు
Yogi Adityanath : ఒకరు రాష్ట్రానికి ముఖ్యమంత్రి. మరొకరు ఆ రాష్ట్ర రాజకీయ చరిత్రను శాసించిన వ్యక్తి. ఇద్దరూ వారి వారి మార్గాలలో ఉద్దండులే.
కానీ రాజకీయాలు అన్నవి ఎన్నికల వరకేనని, ఆ తర్వాత రాష్ట్ర అభివృద్ధిలో అధికారపక్షం, ప్రతిపక్షం కలిసి నడవాలన్నది ఆ రెండు పార్టీల నాయకుల ఉద్దేశం.
ఇలాంటి ఆరోగ్యకరమైన పరిణామాలు చాలా అరుదుగా చోటు చేసుకుంటాయి. అలాంటి అరుదైన సన్నివేశం సోమవారం చోటు చేసుకుంది ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో.
గత కొంత కాలం నుంచి సమాజ్ వాది పార్టీ వ్యవస్థాపకుడు, పార్టీ చీఫ్ ,మాజీ సీఎం అయిన ములాయం సింగ్ యాదవ్ అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ప్రస్తుతం ఆయన లక్నోలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.
విషయం తెలుసుకున్న యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్(Yogi Adityanath) ఇవాళ ములాయం ఇంటికి వెళ్లారు. ప్రస్తుతం తనయుడు , సమాజ్ వాది పార్టీ శాసనసభపక్ష నాయకుడు అఖిలేష్ యాదవ్ కూడా ఇంట్లోనే ఉన్నారు.
అనుకోకుండా సీఎం యోగి విషయం తెలుసుకున్న వెంటనే ములాయం వద్దకు వెళ్లారు. తమ ఇంటికి వచ్చిన సీఎం యోగి ఆదిత్యానాథ్ కు సాదర స్వాగతం పలికారు అఖిలేష్ యాదవ్. ములాయం సింగ్ ను పరామర్శించారు సీఎం.
క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సింగ్ కింగ్, టార్చ్ బేరర్ గా పేరొందిన బుల్డోజర్ బాబాగా ప్రసిద్ది చెందిన యోగి ఆదిత్యానాథ్ ను ఆశీర్వదించారు.
జీతే రహే బేటా అంటూ. ప్రస్తుతం ములాయం సింగ్ యాదవ్ , యోగి కలిసి దిగిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.
Also Read : ‘మరాఠా’పై విచారించనున్న సుప్రీంకోర్టు