UP CM : లులు మాల్ లో ప్రార్థ‌న‌ల‌పై సీఎం క‌న్నెర్ర‌

ప్ర‌ద‌ర్శ‌న‌లు, ఆందోళ‌న‌ల‌కు నో ప‌ర్మిష‌న్

UP CM : యూపీ ల‌క్నో లోని లులు మాల్ లో కొంత మంది ప్రార్థ‌న‌లు చేయ‌డంపై సీరియ‌స్ గా స్పందించారు యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్. అన‌వ‌స‌ర‌మైన వ్యాఖ్య‌లు, ఆందోళ‌న‌లు, ప్ర‌ద‌ర్శ‌న‌లు చేసే వారిని వెంట‌నే గుర్తించి అరెస్ట్ చేయాల‌ని ఆదేశించారు సీఎం.

ఇదిలా ఉండ‌గా లులు మాల్ లో కొంత మంది పురుషులు నమాజ్ చేస్తున్న దృశ్యాల‌తో కూడిన వీడియో సోష‌ల్ మీడియాను షేక్ చేసింది. దీనిపై ఆరా తీశారు యోగి ఆదిత్యానాథ్. ప్రార్థ‌న‌లు, నిర‌స‌న‌ల‌పై ప‌లువురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ప్ర‌జ‌ల రాక పోక‌ల‌ను అడ్డుకునేలా ఎవ‌రు ప్ర‌య‌త్నం చేసినా ఊరుకోబోమంటూ వార్నింగ్ ఇచ్చారు యోగి ఆదిత్యానాథ్. ల‌క్నో ప‌రిపాల‌న ఈ విష‌యాన్ని సీరియ‌స్ గా తీసుకోవాలి.

ఇలాంటి విసుగు క‌లిగించే ప్ర‌య‌త్నించే దుర్మార్గుల‌పై క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల‌ని ఈనెల 10న అబుదాబికి చెందిన లులు గ్రూప్ కు చెందిన భార‌తీయ సంత‌తికి చెందిన బిలీయ‌నీర్ నిర్వ‌హిస్తున్న మాల్ ను ప్రారంభించారు సీఎం యోగి ఆదిత్యానాథ్(UP CM) .

జూలై 12న మాల్ లో న‌మాజ్ చేస్తున్న ఎనిమిది మంది ముస్లిం పురుషుల‌లో న‌లుగురిని అరెస్ట్ చేశారు. కొంత మంది హిందువులు మత ప‌ర‌మైన భావాల‌ను రెచ్చ గొట్టార‌నే ఆరోప‌ణ‌ల‌పై కేసు న‌మోదు చేశారు.

మ‌త ప‌ర‌మైన కార్య‌క‌లాపాల కోసం బ‌హిరంగ స్థలాన్ని ఉప‌యోగించే వారి ద్వారా మ‌త సామ‌ర‌స్యాన్ని ఉల్లంఘించార‌ని ప‌లు సంస్థ‌లు ఆరోపించాయి. ప్ర‌తిగా హ‌నుమాన్ చాలీసాను ప‌ఠించేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని కోరాయి.

దీనిని తిర‌స్క‌రించింది ప్ర‌భుత్వం. జూలై 15న ప్రార్థ‌న‌లు నిర్వ‌హించేందుకు ప్ర‌య‌త్నించిన ముగ్గురు హిందువుల‌ను అరెస్ట్ చేశారు. మ‌రో ముస్లిం వ్య‌క్తి న‌మాజ్ చేసేందుకు ప్ర‌య‌త్నించినందుకు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 10 మందిపై కేసు నమోదు చేశారు.

Also Read : సంజ‌య్ రౌత్ కు ఈడీ స‌మ‌న్లు జారీ

Leave A Reply

Your Email Id will not be published!