KTR : హైదరాబాద్ లో బెయిన్ క్యాపిటల్ – కేటీఆర్
ఏర్పాటు చేయనుందని ప్రకటన
KTR : తెలంగాణకు భారీగా పెట్టుబడులు తీసుకు రావడంలో కీలకంగా మారారు ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్(KTR). గత కొన్ని రోజులుగా అమెరికాలో పర్యటిస్తున్నారు. పలు కంపెనీలు, సిఇఓలు, చైర్మన్లు, పెట్టుబడిదారులు, ఔత్సాహికులతో వరుసగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులను పెట్టాలని ఆహ్వానించారు.
ఈ మేరకు ఔత్సాహికుల నుంచి భారీ ఎత్తున స్పందన వచ్చింది. దీంతో కేటీఆర్ బృందం సక్సెస్ అయ్యారు. వీరి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. పలు కంపెనీలు హైదరాబాద్ లో తమ పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు మొగ్గు చూపారు. దీనికి ప్రధాన కారణం మంత్రి కేటీఆర్(KTR).
తాజాగా మరో కీలక ప్రకటన చేశారు మంత్రి. హైదరాబాద్ ఐటీఈఎస్ రంగానికి మరో భారీ చేరిక కావడం ఆనందంగా ఉందన్నారు కేటీఆర్. బెయిన్ క్యాపిటల్ యాజమాన్యంలోని కంపెనీ మన ప్రాంతాన్ని ఎంపిక చేసుకుందని తెలిపారు.
బయాన్ కంపెనీ కస్టమర్ అనుభవ పరిష్కారాలను అందించే ప్రముఖ ప్రొవైడర్. ఉత్తర అమెరికా, లాటిన్ అమెరికా, ఆసియా, యూరప్ , కరేబియన్ లలో 42 ప్రదేశాలలో ఉనికిని కలిగి ఉందన్నారు. హైదరాబాద్ లో 10,000 మందికి జాబ్స్ రానున్నాయని వెల్లడించారు మంత్రి కేటీఆర్.
Also Read : Joe Biden PM Modi