Joe Biden : భారత్ సర్కార్ పై జో బైడెన్ కు ఫిర్యాదు
వ్యవసాయ రంగంపై ఆరోపణలు
Joe Biden : భారత్ పై చర్యలు తీసుకోవాలంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) కు కాంగ్రెస్ చట్ట సభ్యులు కోరారు. ఈ మేరకు వారు భారత వ్యవసాయ రంగంపై తమ అక్కసు వెళ్లగక్కారు.
సాగు చేస్తున్న ఈ రంగంలో సరైన నియామాలు పాటించడం లేదంటూ ఆరోపించారు. ఇందుకు సంబంధించి భారత్ తో వెంటనే సమావేశం కావాలని, అంతర్జాతీయ రూల్స్ కు అనుగుణంగా ఉండేలా ఒప్పించాలని స్పష్టం చేశారు.
మొత్తం 12 మంది సభ్యులు లేఖ సంధించారు. ఆ లేఖలో ప్రపంచ వాణిజ్య సంస్థ రూల్స్ మేరకు ఆయా దేశాలు తయారు చేసిన వస్తువులకు సంబంధించి ఉత్పత్తిలో 10 శాతం దాకా సబ్సిడీ ఇచ్చేందుకు పర్మిషన్ ఇస్తాయి.
కానీ భారత్ అలా చేయడం లేదంటూ పేర్కొన్నారు. ఇదే సమయంలో భారత ప్రభుత్వం వాటిని తుంగలో తొక్కిందంటూ ఆరోపించారు. ఆపై బియ్యం, గోధుమలతో సహా అనేక వస్తువులకు సంబంధించి సగానికి పైగా సబ్సిడీ ఇస్తోందంటూ మండిపడ్డారు.
తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా చేయడం వల్ల అమెరికా ఉత్పత్తులకు దెబ్బ పడుతుందని, అంతే కాకుండా ఇతర దేశాలపై పెను ప్రభావం చూపుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒక్క భారత్ ఇలా చేయడం వల్ల ప్రపంచ వాణిజ్య రంగంపై తీవ్ర నష్టం చేకూరిందని తెలిపారు. అమెరికాకు చెందిన రైతులపై ఎక్కువ ప్రభావం చూపుతుందన్నారు.
పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఆహార సంక్షోభం దృష్టిలో పెట్టుకుని భారత్ ను ఒప్పించాలని కోరారు. పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు.
Also Read : పుతిన్ మహిళ అయితే యుద్దం జరిగేది కాదు