US Consul General : ఏపీ సీఎం పనితీరు భేష్ – లార్సన్
కరోనా కట్టడిలో ఏపీ కృషి బెటర్
US Consul General : కరోనా కట్టడితో పాటు ఇతర రంగాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని టాప్ లో కొనసాగేలా కృషి చేస్తున్న సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డిని ప్రత్యేకంగా ప్రశంసలతో ముంచెత్తారు అమెరికా కాన్సుల్ జెన్నిఫర్ లార్సన్(US Consul General). ఆమె ఇటీవల హైదరాబాద్ లో అమెరికా కాన్సుల్ జనరల్ గా పదవీ బాధ్యతలు చేపట్టారు.
ఈ సందర్భంగా జెన్నిఫర్ లార్సన్ మర్యాద పూర్వకంగా జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. కీలక అంశాల గురించి ప్రత్యేకంగా చర్చించారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి ఏపీలో పర్యటించారు.
ఏపీ రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో కీలకమైన పాత్ర పోషించిందని పేర్కొన్నారు. ఇందుకు ప్రత్యేకించి సీఎం ప్రయత్నాలను తాను అభినందిస్తున్నట్లు తెలిపారు.
మహమ్మారిని ఎదుర్కోవడంలో ఉత్తమ పద్దతులను అవలంభించవడం తనను ఆశ్చర్య పోయేలా చేసిందన్నారు జెన్నిఫర్ లార్సన్. జీడీపీ వృద్ధి రేటులో దేశంలోనే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నెంబర్ వన్ గా నిలిచినందుకు సీఎం( CM Jagan) కు కితాబు ఇచ్చారు.
ఇదిలా ఉండగా తమ ప్రభుత్వ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాల గురించి అమెరికా కాన్సుల్ జెన్నిఫర్ లార్సన్ కు తెలియ చేశారు సీఎం జగన్ మోహన్ రెడ్డి.
విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులను ప్రోత్సహించాలని అమెరికా కాన్సుల్ కు విన్నవించారు. పెట్టుబడులు పెట్టాలని అనుకునే వారికి తమ ప్రభుత్వం అన్ని సహాయ సహకారాలు అందజేస్తుందని స్పష్టం చేశారు సీఎం.
Also Read : జెమిని ఎడిబుల్స్ తెలంగాణలో పెట్టుబడి