US Emergency Declares : అమెరికాలో హెల్త్ ఎమ‌ర్జెన్సీ విధింపు

6,600కు పైగా మంకీ పాక్స్ కేసులు

US Emergency Declares  :  నిన్న‌టి దాకా ప్ర‌పంచాన్ని క‌రోనా క‌కావిక‌లం చేసింది. తాజాగా మంకీ పాక్స్ తీవ్ర భ‌యాందోళ‌న‌కు గురి చేస్తోంది. ఈ వైర‌స్ అత్యంత ప్రమాద‌క‌ర‌మ‌ని గుర్తించింద అగ్ర‌రాజ్యం అమెరికా.

ఈ వైర‌స్ ను తీవ్రంగా తీవ్రంగా ప‌రిగ‌ణించింది. దేశంలోని ప్ర‌జ‌లంతా మంకీ పాక్స్ వ్యాధి ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రించారు అమెరికా దేశ ఆరోగ్య , మాన‌వ సేవ‌ల కార్య‌ద‌ర్శి జేవియ‌ర్ బెకెరా.

ఈ మేర‌కు మంకీ పాక్స్ ను ప‌బ్లిక్ హెల్త్ ఎమ‌ర్జెన్సీగా (US Emergency Declares) ప్ర‌క‌టిస్తున్న‌ట్లు వెల్ల‌డించింది అమెరికా. ఈ నిర్ణ‌యం వ‌ల్ల కొత్త నిధుల‌ను ఖ‌ర్చు చేయ‌డం. డేటా సేక‌ర‌ణ‌లో స‌హాయం చేయ‌డం, మంకీ పాక్స్ కు వ్య‌తిరేకంగా అద‌న‌పు సిబ్బందిని మోహ‌రించ‌డం, ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేసేందుకు ఉప‌క‌రిస్తుంది.

ఈ వైర‌స్ ను ప‌రిస్క‌రించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నాం. ప్ర‌జలు ప్ర‌భుత్వానికి స‌హ‌క‌రించాల‌ని ఈ సంద‌ర్భంగా విన్న‌వించింది. మంకీ పాక్స్ అనే వైర‌స్ తీవ్ర‌మైన‌ది.

దీని ప‌ట్ల ఏ ఒక్క‌రూ నిర్ల‌క్ష్యంగా ఉండ కూడ‌ద‌ని హెచ్చ‌రించింది. ఈ వైర‌స్ ను ఎదుర్కోవ‌డంలో త‌మ‌కు స‌హాయం చేయాల‌ని కోరింది స‌ర్కార్. ఏ మాత్రం అనుమానం వ‌చ్చినా వెంట‌నే వైద్య సిబ్బందిని, ఆరోగ్య నిపుణుల‌ను, ద‌గ్గ‌ర‌లో ఉన్న ఆస్ప‌త్రుల‌ను సంద‌ర్శించాల‌ని అమెరికా ప్ర‌భుత్వం సూచించింది.

ప్రారంభంలో ఈ వ్యాధి 90 రోజుల పాటు ఉంటుంద‌ని తెలిపింది. గురువారం ఒక్క రోజే దేశ వ్యాప్తంగా ఏకంగా 6,600 మంకీ పాక్స్ కేసులు న‌మోద‌య్యాయి. వీటిలో నాలుగింట ఒక వంతు న్యూయార్క్ రాష్ట్రం నుంచే న‌మోదు కావ‌డం విశేషం.

Also Read : ఉద్యోగుల నిర్వాకం సిఇఓ ఆగ్ర‌హం

Leave A Reply

Your Email Id will not be published!