US House Bans Tik Tok : టిక్ టాక్ కు అమెరికా బిగ్ షాక్
US House Bans Tik Tok : చైనాకు చెందిన ప్రముఖ వీడియో షేరిగ్ యాప్ టిక్ టాక్ కు కోలుకోలేని షాక్ తగిలింది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా మోస్ట్ పాపులర్ యాప్ గా ఇది పేరొందింది. అయితే వరల్డ్ మార్కెట్ లో ఇప్పుడు చైనా హవా కొనసాగుతోంది. మొబైల్స్ , డివైజ్ ల తయారీలో కూడా ఆ దేశమే ముందంజలో ఉంది.
ఇక చైనా దూకుడును తట్టుకోలేక పోతోంది అగ్రరాజ్యం అమెరికా. ఓ వైపు మంచు తుపానుతో నానా తంటాలు పడుతోంది. ఈ తరుణంలో కీలక ప్రకటన చేసింది. టిక్ టాక్ యాప్ వల్ల తమ దేశానికి సంబంధించిన సమాచారం లీక్ అవుతున్నట్లు అనుమానిస్తోంది యుఎస్. దీంతో తమ దేశంలో టిక్ టాక్ ను నిషేధిస్తున్నట్లు(US House Bans Tik Tok) ప్రకటించింది అమెరికా హౌస్. ఈ యాప్ ను తమ చట్ట సభల డివైజ్ ల నుంచి తొలగిస్తున్నట్లు స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా దేశం మొత్తం కాకుండా కేవలం యుఎస్ సర్కార్ డివైజ్ లలో మాత్రమే వినియోగించ కూడదని పేర్కొంది . ఈ మేరకు యుఎస్ హౌస్ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. మరో వైపు చైనా, అమెరికా మధ్య నువ్వా నేనా అన్న రీతిలో మాటల యుద్దం కొనసాగుతోంది. కేవలం సెక్యూరిటీ కారణాల రీత్యా మాత్రమే టిక్ టాక్ యాప్ ను నిషేధించాల్సి వచ్చిందని స్పష్టం చేసింది అమెరికా హౌస్.
ఇంకో వైపు ఇప్పటికే యుఎస్ఏ లోని టెక్సాస్ , జార్జియా, మేరీలాండ్ , తదితర రాష్ట్రాలలో టిక్ టాక్ ను నిషేధించాయి. దీని కారణంగా వరల్డ్ వైడ్ గా టిక్ టాక్ ఆదరణ మాత్రం తగ్గలేదు. ఇండియాలో ఇప్పటికే భారత దేశం నిషేధం విధించింది. దానికి సంబంధించిన ఆఫీసును కూడా తొలగించింది టిక్ టాక్ కంపెనీ.
Also Read : కోవిడ్ మార్గదర్శకాలు పాటించాల్సిందే