US OPEC Focus : రియాద్ తో సంబంధంపై యుఎస్ ఫోక‌స్

పునః స‌మీక్ష చేస్తున్న అమెరికా చీఫ్ బైడెన్

US OPEC Focus : ఓ వైపు ఉక్రెయిన్, ర‌ష్యా నువ్వా నేనా అంటూ యుద్దం చేస్తున్నాయి. మ‌రో వైపు ఆయిల్ ధ‌ర‌లు మండుతున్నాయి. ఈ త‌రుణంలో అమెరికా సౌదీ వైపు చూస్తోంది. సౌదీ అరేబియాతో సంబంధాలు మ‌రింత పెంచుకునే దిశ‌గా ఆలోచిస్తోంది. మాస్కో నేతృత్వంలోని 13 దేశాల ఒపెక్ కార్టెల్ , దాని మిత్ర దేశాలు న‌వంబ‌ర్ నుండి రోజుకు రెండు మిలియ‌న్ బ్యారెళ్ల ఉత్ప‌త్తిని త‌గ్గించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాయి.

దీనిపై భ‌గ్గుమంది అమెరికా. దీంతో చ‌మురు ధ‌ర‌లు మ‌రింత పెరుగుతాయ‌న్న ప్ర‌చారం జోరందుకుంది. మొత్తంగా రియాద్ తో యుఎస్ సంబంధాన్ని పునః ప‌రిశీలించాల్సి ఉంద‌ని వైట్ హౌస్ తెలిపింది. జో బైడెన్(US OPEC Focus) ఆ దిశ‌గా ఆలోచిస్తున్న‌ట్లు పేర్కొంది. సౌదీ నేతృత్వంలోని చ‌మురు ఉత్ప‌త్తి దేశాల కూట‌మి ఉత్ప‌త్తిని త‌గ్గించేందుకు ర‌ష్యా వైపు నిలిచింది.

జాతీయ భ‌ద్ర‌తా మండ‌లి అమెరికా ప్ర‌తినిధి జాన్ కిర్బీ సీఎన్ఎన్ తో మాట్లాడారు. చ‌మురు విష‌యంపై పున‌రాలోచించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. దీనిని ప్ర‌త్యేకంగా అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ ప్ర‌స్తావించార‌ని ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు. జ‌ర్న‌లిస్ట్ జ‌మాల్ ఖ‌షోగ్గి హ‌త్య త‌ర్వాత మొద‌టిసారిగా అమెరికా చీఫ్ సౌదీలో ప‌ర్య‌టించింది.

సౌదీ ప్రిన్స్ మొహ‌మ్మ‌ద్ బిన్ స‌ల్మాన్ తో స‌మావేశం అయిన‌ప్ప‌టి నుండి ఈ నిర్ణ‌యం దౌత్య ప‌ర‌మైన చెంప దెబ్బ‌గా ప‌రిగ‌ణించ‌బ‌డింది. బైడ‌న్ కు సంబంధించిన డెమోక్ర‌టిక్ పార్టీకి కీల‌క అంశం. ఎందుకంటే ఇది న‌వంబ‌ర్ మ‌ధ్యంత‌ర ఎన్నిక‌ల‌ను ఎదుర్కోనున్న‌ది. పెరుగుతున్న ధ‌ర‌ల‌ను క‌ట్ట‌డి చేయాల్సిన అవ‌స‌రం కూడా బైడెన్ పై ఉంది.

Also Read : ఉప ప్ర‌ధానికి జై శంక‌ర్ క్రికెట్ బ్యాట్ గిఫ్ట్

Leave A Reply

Your Email Id will not be published!