Joe Biden : అమెరికా అధ్యక్షుడు జోసెఫ్ బైడెన్ ఈ మధ్యన ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదు. నోరు జారడం ఆపై తప్పు తెలుసుకుని సరి చేసుకోవడం వస్తూ ఉన్నారు. ఎవరైనా అధ్యక్షుడు భార్యను ఫస్ట్ లేడీ అని పిలుస్తారు.
ఆ దేశ ప్రజలు గౌరవిస్తారు. తాజాగా జోసెఫ్ బైడెన్ (Joe Biden)అమెరికా దేశ ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ ను ఫస్ట్ లేడీ అని పిలిచారు. దీంతో ఆయన చేసిన కామెంట్స్ కు ప్రేక్షకులు నవ్వులు కురిపించారు.
తన తప్పు తెలుసుకున్న బైడెన్ సరి చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో హల్ చల్ అవుతోంది.
బైడెన్ వయసు 79 ఏళ్లు. వైట్ హౌస్ లో సమాన వేతన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జోసెఫ్ బైడెన్ (Joe Biden)ప్రసంగించారు.
కమలా హారీస్ గురించి ప్రథమ మహిళ అని పేర్కొనడాన్ని తప్పేనని పేర్కొంటూ సరిద్దుకునే ప్రయత్నం చేశారు అమెరికా చీఫ్ . ఇదిలా ఉండగా ఈ అరుదైన కార్యక్రమానికి కమలా హారీస్ వ్యక్తిగత కారణాల రీత్యా హాజరు కాలేదు.
ఆమె ఎందుకు రాలేదన్న దానికి వివరణ ఇస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ఫస్ట్ లేడీ కమలా హారీస్ భర్త కరోనా బారిన పడడంతో ఈ వేతన సమాన కార్యక్రమానికి హాజరు కాలేక పోయారని చెప్పారు జోసెఫ్ బైడెన్.
దీంతో సమావేశం హాలులో కూర్చున్న వారంతా బైడెన్ మాటలకు నవ్వుకున్నారు.
Also Read : సాంకేతిక లోపం మిస్సైల్ ప్రయోగం