US VISA Clear : ఇంట‌ర్వ్యూలు లేకుండానే వీసాలు జారీ

కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన అమెరికా ప్ర‌భుత్వం

US VISA Clear : ప్ర‌పంచ వ్యాప్తంగా ఎక్కువ‌గా వీసాల కోసం ఎగ‌బ‌డేది. ఎక్కువ‌గా ఆధార ప‌డేది మాత్రం ఏకైక దేశం అమెరికానే. ఆ త‌ర్వాత కెన‌డా, ఆస్ట్రేలియా, యుకె, సింగ‌పూర్, దుబాయ్, త‌దిత‌ర దేశాలు ఉన్నాయి.

తాజాగా యుఎస్ కు క్యూ క‌ట్టే వారిలో భార‌తీయులు ఎక్కువ‌గా ఉన్నారు. తాజాగా అమెరికా ప్ర‌భుత్వం కీల‌క‌మైన ప్ర‌క‌ట‌న చేసింది. భార‌తీయుకు బీ1, బీ2 వంటి సాధార‌ణ వీసాల జారీ(US VISA Clear) ప్ర‌క్రియ ఇప్ప‌టికే స్టార్ట్ అయ్యింది.

ఈ త‌రుణంలో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. ఇక‌పై ఇంట‌ర్వ్యూలు లేకుండానే వీసాలు మంజూరు చేయాల‌ని కాన్సులేట్ (కాన్సుల‌ర్ ) ఆఫీస‌ర్ల‌ను ఆ దేశ విదేశాంగ శాఖ ఆదేశించింది.

ఈ కీల‌క నిబంధ‌న డిసెంబ‌ర్ 31 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్న నిర్దిష్ట కేట‌గిరీల ద‌ర‌ఖాస్తు దారుల‌కు మాత్ర‌మే వ‌ర్తిస్తుంద‌ని స్ప‌ష్టం చేసింది.

ఇందులో భాగంగా ఎఫ్‌, హెచ్ -1 , హెచ్ -3 , హెచ్ -4 , నాన్ బ్లాంకెట్ ఎల్, ఎం, ఓపీ క్యూ , అకాడ‌మిక్ జే వీసాల‌కు(US VISA Clear) ఈ కొత్త రూల్ వ‌ర్తింప చేస్తుంద‌ని పేర్కొంది.

అంతే కాకుండా వీసాల‌కు సంబంధించి గ‌డువు ముగిసిన త‌ర‌వ్ఆత 48 నెల‌ల లోపు రెన్యూవ‌ల్ చేయించుకునే వారికి కూడా ఇంట‌ర్వ్యూల నుంచి మిన‌హాయింపు ఇస్తున్న‌ట్లు వెల్ల‌డించింది అమెరికా ప్ర‌భుత్వం.

అయితే గ‌తంలో వీసాలు తిర‌స్క‌ర‌ణ‌కు గురైన వారికి ఈ వెసులుబాటు వ‌ర్తించద‌ని స్ప‌ష్టం చేసింది. క‌రోనా స‌మ‌యంలో క‌లిగిన ఇబ్బందులే ఇందుకు కార‌ణ‌మ‌ని తెలిపింది.

క‌రోనా స‌మ‌యంలో రుసుము చెల్లించిన వారి వ్యాలిడిటీని వ‌చ్చే ఏడాది సెప్టెంబ‌ర్ 23 వ‌ర‌కు పొడిగించిన‌ట్లు స్ప‌ష్టం చేసింది.

Also Read : ప్ర‌చారం ముగిసింది ఫ‌లిత‌మే మిగిలింది

Leave A Reply

Your Email Id will not be published!