Jen Psaki : పెద్దన్న అమెరికా తన తీరు మార్చు కోవడం లేదు. మరోసారి భారత్ ను ఉద్దేశించి కామెంట్ చేసింది. ఉక్రెయిన్ పై రష్యా దాడులకు దిగడం, ఈ విషయంలో ఇండియా అనుసరిస్తున్న విధానంపై మండి పడుతోంది.
మరో వైపు రష్యాతో సత్ సంబంధాలు నెరుపుతోంది భారత్. ఇటీవలే రష్యా విదేశాంగ శాఖ మంత్రి లావ్ రోవ్ వచ్చారు. ప్రధాని మోదీతో పాటు విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ తో భేటీ అయ్యారు.
ఎంతైనా ఆయిల్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నామని స్పష్టం చేశారు. రష్యన్ ఇంధనంతో పాటు ఇతర వస్తువులను దిగుమతి చేసుకోవడాన్ని అభ్యంతరం వ్యక్తం చేసింది అమెరికా.
ఆ దేశం తన వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయమని అమెరికా వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకీ (Jen Psaki )స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడారు.
ఇంధన దిగుమతులను వైవిధ్య పర్చడంలో భారత దేశానికి మద్దతు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నామని చెప్పారు. రష్యా ఇంధన దిగుమతులను భారత్ వేగవంతం చేయాలని లేదా పెంచాలని తాము భావించడం లేదని పేరకొన్నారు జెన్ సాకీ(Jen Psaki ).
యుక్రెయిన్ పై దాడి చేసినందుకు గాను అమెరికా రష్యాపై ఆంక్షలు విధించింది. ఇదే సమయంలో భారత్ కూడా రష్యాతో టచ్ లో ఉండ కూడదని స్పష్టం చేసింది.
ఈ విషయంలో భారత్ కోరితే తాము ఎల్లవేళలా మద్దతు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నామని చెప్పారు. తాము భారత దేశంతో సత్ సంబంధాలు కలిగి ఉండాలని అనుకుంటున్నామని పేర్కొన్నారు.
Also Read : దిగి పోవడం తప్ప దారి లేదు